హైదరాబాద్‌లో నానాటికి ట్రాఫిక్ పెరిగిపోతోంది. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టుగా రోడ్ల విస్తీర్ణం లేకపోవడంతో నగరంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. దీనికి తోడు ప్రతినిత్యం ఏదోమూలన యాక్సిడెంట్లు జరుగుతూ వందలమందిని బలైపోతున్నారు.

దీంతో వాహన ప్రయాణం సుఖవంతంగా సాగేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు 44వ నెంబర్ జాతీయ రహదారిపై 18.4 కిలోమీటర్ల మేర స్కై వేను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Also Read:బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం: శిక్షణ లేనివాళ్లు డ్రైవర్లా..? కేసీఆర్‌పై మృతురాలి భర్త ఫైర్

ప్రపంచంలోనే మొదటి సారిగా ఏకకాలంలో ఒకే మార్గంలో.. ఒకే పిల్లర్‌పై మెట్రో రైలు, ఫ్లై ఓవర్‌ ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తయారు చేయడానికి కన్సల్టెన్సీలను ఎంపిక చేసేందుకు హెచ్ఎండీఏ బిడ్లను ఆహ్వానించింది.

ఈ స్కై వే కారిడార్‌ రహదారిగానూ పనిచేస్తుంది. దీనికి అనుబంధంగా సర్వీస్ రోడ్లు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేలా ఇంటర్ సెక్షన్లు సైతం ఉండనున్నాయి. ఈ స్కై వే ఆరు లైన్ల ఎలివేటేడ్ కారిడార్... ప్రస్తుతం కండ్లకోయ మీదుగా వెళ్లే జాతీయ రహదారి కేవలం నాలుగు లైన్లది మాత్రమే.

రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రస్తుతం ఉణ్న రహదారులను ఇరువైపులా రెండు లైన్ల సర్వీస్ రోడ్లతో కలిపి ఆరు లైన్ల రోడ్‌గా తయారు చేస్తారు. ఈ కారిడార్‌లో టోల్‌ప్లాజాలు, ట్రక్ లే బైలు, బస్‌ బేలు మరియు బస్ షెల్టర్లు ఉంటాయి.

Also Read:టైలరింగ్ ద్వారా సంపాదించా: ఐటీ అధికారులకు షాకిచ్చిన నయీం భార్య

రిక్వెస్టెడ్ ఫర్ ప్రపోజల్(RfP)లు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 12. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ రూ.1,500 కోట్లు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఈ కారిడార్‌ను నిర్మించనున్నారు.