ఆదివారం సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ శానససభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు.

సీతాఫల్‌మండిలోని ఉప్పలమ్మ సమేత కనకదుర్గ దేవాలయంలో నిర్వహించిన చండి యాగంలో పద్మారావు పాల్గొన్నారు. అలాగే సిక్కు గురుద్వారా అనుబంధ భవన సముదాయానికి భూమి నిర్వహించారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సుఖసంతోషాలతో అన్ని పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు.

అన్ని మతాల ప్రధాన పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గుర్తుచేశారు. సిక్కులకు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యతను కల్పిస్తోందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సామల హేమతో పాటు గురుద్వారా ప్రతినిధులు పాల్గొన్నారు.