హైదరాబాద్: బాధ్యతాయుతమైన డాక్టర్ వృత్తిలో వున్న ఓ వ్యక్తి మానవ సబంధాలకే మచ్చ తెచ్చేలా వ్యవహరించాడు.  వావివరసలు మరిచి వయసులో వున్న సొంత తమ్ముడి కూతురిపైనే కన్నేసి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో చోటుచేసుకుంది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పేట్ బషీరాబాద్ లో ఓ  డెంటల్ డాక్టర్ ఉమ్మడి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే సదరు డాక్టర్ తమ్ముడికి ఓ కుమార్తె(21) వుంది. వయసులో ఉన్న ఆమెను అనుభవించాలన్న దుర్మార్గమైన ఆలోచనతో వావివరసలు మరిచిన డాక్టర్ మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. 

సొంత పెదనాన్న కావడంతో యువతి కూడా అతడి దుర్మార్గపు ఆలోచనను పసిగట్టలేకపోయింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికయినా చెబితే బావుండదని బెదిరించాడు. 

read more   హైదరాబాద్ లో దారుణం... నమస్తే పెట్టలేదని నడిరోడ్డుపై దారుణ హత్య

అయితే అతడి బెదిరింపులతో భయపడిపోయిన యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే మళ్లీ పెదనాన్న వేధింపులకు పాల్పడుతుండటంతో దైర్యం చేసి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు హైదరాబాద్ షీటీమ్ ను ఆశ్రయించారు. 

బాధిత యువతి, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.