హైదరాబాద్: మనిషి ప్రాణాలను కనీస రక్షణ కరుణవయ్యింది. చిన్న చిన్న విషయాలే ఏకంగా ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి వెళుతున్నాయి. ఇలా మానవత్వం మంటగలిసిన దారుణ సంఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేటుకుంది. 

నగరంలోని పాతబస్తీ హసన్ నగర్ లో నివాసముండే షేక్ జావిద్(28) అనే యువకుడు వంటపనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇలా శనివారం రాత్రి తన పనులు ముగించుకుని రోషన్ కాలనీ మీదుగా ఇంటికి వెళుతుండగా ఓ నలుగురు వ్యక్తులు అడ్డువచ్చారు. వీరిలో ఒకరికి అతడు మర్యాదపూర్వకంగా నమస్కారం పెట్టాడు. 

read more   దారుణం: మాస్కుపై మత్తు చల్లి బాలికపై అత్యాచారం

అయితే ఈ నలుగురిలోనే మరో వ్యక్తి ఈ విషయంపై  తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన పక్కనున్న వ్యక్తికి కావాలనే నమస్కరించి తనకు పెట్టకుండా అవమానించావంటూ జావీద్ తో గొడవకు దిగాడు. ఇదికాస్తా పెద్దదవడంతో ఆ వ్యక్తి తనవద్ద వున్న కత్తితో జావీద్ ను విచక్షణారహితంగా పొడిచాడు.  దీంతో తీవ్ర  రక్తస్రావమై అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. 

ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో నిందితులుగా భావిస్తూ అజహార్‌, హన్నాన్‌, సయిద్‌, కమ్రాన్‌ అనే నలుగురికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.