హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో అత్యంత అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఓ తండ్రి తన కన్నకూతురిని హత్య చేశాడు. దుర్గారావు అనే వ్యక్తి తాగి వచ్చి తన ఐదేళ్ల కూతురు యామినిని గొంతు నులిమి చంపేశాడు. 

భార్య ఇంట్లో లేని సమయంలో దుర్గారావు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఎల్బీ నగర్ లోని బాలాజీ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.

వివరాలు అందాల్సి ఉంది.