హైదరాబాద్: చెల్లిని కాపురానికి తీసుకెళ్లకుండా వదిలసిన సొంత బావను హతమార్చేందుకు ఓ సుఫారీ గ్యాంగ్ ను రంగంలోకి దింపాడు బామ్మర్ది. ఇలా బావ హత్యకు కుట్ర పన్నిన కానిస్టేబుల్ కుట్రను రట్టుచేసి నలుగురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ ప్రాంతానికి చెందిన షౌకత్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతడి చెల్లిని మమబూబ్ నగర్ కు చెందిన జాకేర్ నిచ్చి పెళ్లిచేశారు. అయితే కొంతకాలం సాపీగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలై భార్యాభర్తలిద్దరు విడిపోయారు. దీంతో ఆమె అన్నయ్య షౌకత్ కుటుంబంతో కలిసి పుట్టింట్లోనే వుంటోంది. 

read more  నేరెడ్‌మెట్‌ నాలాలో బాలిక మృతి: జీహెచ్ఎంసీ అధికారులపై తల్లిదండ్రుల ఫిర్యాదు

ఈ క్రమంలోనే జాకీర్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ విషయం గురించి తెలిసి షౌకత్ కోపోద్రిక్తుడై షౌకత్ చెల్లి జీవితాన్ని నాశనం చేసిన బావను చంపడానికి కుట్ర పన్నాడు. ఇందుకోసం సాజిద్‌(37)తో అనే కిరాయి హంతకుడికి రూ.5లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సాజిద్‌ తనకు సహాయంగా అస్లంఖాన్‌(22), షఫీ(45)తో పాటు శిఖాతో కలిసి జాకెర్‌ను హత్య చేయాలని పథకం రచించాడు. 

అయితే ఈ కుట్ర గురించి బయటపడటంతో రాజేంద్రనగర్ పోలీసులు కానిస్టేబుల్ షౌకత్ తో పాటు కిరాయి హంతకులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.