హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగా సీఎంపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునేవారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. అందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే నిదర్శమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్‌ఆర్ సిబిఐ ఎంక్వయిరీ వేయించుకున్నాడని... అలా కేసీఆర్ చేయగలడా అని ప్రశ్నించారు. కొడుకు కేటీఆర్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై సిబిఐ ఎంక్వయిరీ వేయించగలరా అంటూ సవాల్ విసిరారు. 

మంత్రి కేటీఆర్ అక్రమాలను బయటపెట్టినందుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని షబ్బీర్ తప్పుబట్టాడు. ఆయన అక్రమంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించినందుకు 188 సెక్షన్ కింద రూ.108 ఫైన్ వేస్తే సరిపోతుందన్నారు. కానీ రేవంత్ పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం దారుణమని షబ్బీర్ అలీ మండిపడ్డారు. 

read more  కేసీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చే దమ్ము లేదు: రేవంత్ అరెస్టుపై భగ్గుమన్న కోమటిరెడ్డి

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ స్పీకర్ అనుమతితోనే ఓ ఎంపీని అరెస్టు చేయాల్సి ఉంటుందని, అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ఆయన తెలిపారు. 

111 జీవో పరిధిలో నిర్మాణాలకు అనుమతి లేదని, మరి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను ఎలా కట్టారని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఓ న్యాయం, పేదలకు మరో న్యాయమా అని అడిగారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చే దమ్ములు అధికారులకు లేవని ఆయన అన్నారు. 

read more   ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ దే... కానీ...: మంత్రి తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు

కేటీఆర్ ఫామ్ ఫాం హౌస్ పై ట్రిబ్యునల్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. కోకాపేట భూములు కేటీఆర్ మనుషుల చేతుల్లో ఉన్నది వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. గోపన్ పల్లి, కోకాపేట భూములపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గోపన్ పల్లి భూముల విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు.