కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్ష నేపథ్యంతో సిఎం పిఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ ఏడేళ్ల క్రితం రాసిన ‘జ్వలితదీక్ష’ నవల రెండో ముద్రణను మహాత్మాగాంధి 150వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు.

ప్రొఫెసర్‌ అడపా సత్యనారాయణ రాసిన తెలంగాణలో గాంధీ, మహాత్మాగాంధీ ఇన్‌ తెలంగాణ పుస్తకాలను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గాంధీ చూపిన మార్గంలోనే స్వరాష్ర్టాన్ని సాధించామన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపి స్వరాష్ట్రం సాధించగలిగామన్నారు. దీక్ష సమయంలో ప్రజలంతా చూపిన సహనం, అహింసా మార్గం దేశానికే మార్గదర్శకమన్నారు. గాంధీ మార్గంలోనే రాష్ర్టాన్ని సాధిస్తామని తొలినాళ్లలోనే ప్రకటించాం. మహాత్ముడి మార్గాన్ని వీడకుండా గమ్యం చేరుకున్నామని అన్నారు.