హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కారు బీభత్సం సృష్టించింది. చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని మలక్ పేటలో ఈ సంఘటన జరిగింది. డీమార్ట్ నుంచి బయటకు వస్తూ రివర్స్ తీసుకునే క్రమంలో కారు దగ్గరలోని టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. 

బాపురాజు అనే వ్యక్తి మలక్ పేటలోని డీమార్ట్ లో సరుకులు కొనేందుకు తన కారులో వచ్చాడు. షాపింగ్ ముగిసిన తర్వాత పార్కింగ్ నుంచి రివర్స్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. కారు హఠాత్తుగా పక్కనే ఉన్న టీ షాపులోకి దూసుకెళ్లింది. 

ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఇంచార్జీ గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.