హైదరాబాద్: కొడుకును కనాలనే తాపత్రయంతో ఓ వృద్ధుడు అత్యంత నీచానికి ఒడిగట్ాటడు. వ్యాపారవేత్త అయిన 64 ఏళ్ల వృద్దుడికి ముగ్గురు కూతుళ్లున్నారు. అయితే, ఈ వయస్సులో అతనికి కుటుంబానికి వారసుడిని కనాలనే కోరిక పుట్టింది. అయితే, బుద్ధి వక్రించి ఒప్పందాన్ని పక్కన పెట్టి మహిళను వేధించడం ప్రారంభించాడు. 

కృత్రిమ గర్భధారణ ద్వారా తనకు మగ పిల్లాడిని కనాలని ఓ మహిళతో అతను ఒప్పందం చేసుకున్నాడు. అయితే, తనతో శృంగారంలో పాల్గొని సంతానాన్ని కనాలని వేధించడం ప్రారంభించాడు. దాంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాదులని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్ లో జరిగింది. 

హైదరాబాదులోని పంజాగుట్టలో నివాసం ఉంటున్న స్వరూపరాజు (64)కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడిని కనాలనే కోరికతో అతను తన మిత్రుడు నూర్ ను సంప్రదించాడు. అతని సాయంతో కృత్రిమ గర్భధారణ ద్వారా కొడుకును కనేందుకు హైదరాబాదుకు చెందిన 23 ఏళ్ల యువతితో రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ప్రసవం జరిగే వరకు నెలకు రూ.10 వేల చొప్పున కూడా ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ క్రమంలోనే అతను యువతిని కలుసుకున్నాడు. 

అయితే, ఆమెను కలుసుకున్నప్పటి నుంచి అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. కృత్రిమ గర్భధారణ ద్వారా కాకుండా తనతో కలిసి కొడుకును కనాలని వేధించడం ప్రారంభించాడు. దాంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేిసంది. నిందితుడు స్వరూపరాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.