Russia Ukraine War:  రష్యా బలగాల ఉపసంహరణ తర్వాత  రాజధాని కైవ్ ప్రాంతంలో 900 మందికి సాధారణ  పౌరుల మృతదేహాలను కనుగొన్నట్లు ప్రాంతీయ పోలీసు అధికారులు తెలిపారు. ఇందులో 95 శాతం మంది పౌరులు తుపాకితో కాల్చిన గాయాలతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. 

Russia Ukraine War: గ‌త రెండు నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా మారణ హోమం కొనసాగిస్తుంది. ర‌ష్యా దాడుల‌తో ఉక్రెయిన్ న‌గ‌రాలు ధ్వంసమ‌య్యాయి. ర‌ష్యా దాడుల వ‌ల్ల‌ ఉక్రెయిన్ త‌న రూపురేఖలను కోల్పోయింది. ఎక్కడ చూసిన శిథిలమైన భవనాలు.. శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. పుతిన్ యుద్ధోన్మాదం వలన ఉక్రెయిన్ ను స‌ర్వ‌ నాశనమైంది. నిత్యం బాంబులు, క్షిపణులు, విమానాలతో దాడుల‌కు పాల్ప‌డుతున్నాయి ర‌ష్యాన్ బలాగాలు. ప్రధాన నగరాలలో ఎక్కడపడితే అక్కడ శవాల గుట్టలు పడివుండటం దర్శనమిస్తున్నాయి. ప‌లు చోట్ల‌ ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేసే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కుప్పలు తెప్పలుగా శవాలు, వాటికి సామూహిక ఖననాలు, చేతులను వెనక్కు కట్టి పాయింట్ బ్లాంక్‌లో పెట్టి కాల్చి చంపిన ఘటనలు కొకొల్లలుగా బయటపడుతున్నాయి.

ర‌ష్యా దండ‌యాత్ర‌లో ఎంతో మంది అమాయ‌కులు త‌మ ప్రాణాల‌ను కోల్పోయారు. వేలాది మంది గాయాల పాలయ్యారు. ఈ క్ర‌మంలో లక్షల మంది ప్రాణాలు చేత‌ప‌ట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కొన్ని చోట్ల వలస వెళ్లిన దేశాలలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడిన అనేక సంఘటలను వెలుగులోనికి వచ్చాయి. కొన్ని చోట్ల కేవలం యువతులకే ఆశ్రయం ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. తాజా నివేదిక‌లు సంచ‌ల‌న నిజాల‌ను బ‌హిర్గంతం చేస్తున్నాయి. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ లో ర‌ష్యా బ‌ల‌గాలు మ‌ర‌ణాహోమానికి పాల్ప‌డిన‌ట్టు అనేక సాక్ష్యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో 900 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు శుక్రవారం తెలిపారు. కీవ్​ నుంచి రష్యా సేనాలు ఉపసంహరణ తరువాత వందలాది మృతదేహాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఇందులో 95 శాతం మంది పౌరులు తుపాకితో కాల్చిన గాయాలతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

రోజు రోజుకీ శవాలు కుప్ప‌లు తెప్ప‌లుగా బయటపడుతున్నాయని ప్రాంతీయ పోలీసు దళం అధిపతి ఆండ్రీ నెబిటోవ్ వెల్ల‌డించారు. చాలా మంది అమాయ‌కుల మృతదేహాలను వీధుల్లో విడిచిపెట్టారనీ, కొన్ని మృత దేహాల‌ను తాత్కాలికంగా ఖననం చేశారని, ఇందులో 95% మంది తుపాకీ గాయాలతో మరణించారని పోలీసు డేటా వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువమంది బుచా ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. సుమారు 350 మంది ఈ ప్రాంత వాసులే మరణించారని తెలిపారు.

మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పెరుగుతున్నాయి. గురవారం నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌక ఒకటి తీవ్రంగా దెబ్బతింది. దానిపైకి రెండు క్షిపణులను గురిపెట్టి తామే దెబ్బ తీసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.