హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. సరదా ఊయల ఊగడానికి మంచానికి కట్టిన చున్నీ మెడకు చుట్టుకుని ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. చున్నీ మెడకు చుట్టుకుని బాలుడు మరణించిన ఈ సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం ఎల్లసఖి గ్రామానికి చెందిన అంజలి, నర్సింహ టైలర్స్ గా పనచేస్తూ యూసుఫ్ గుడా యాదగిరి నగర్ చర్చి సందులో అ్ద్దెకు ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు మల్లికార్డున్ 7వ తరగతి చదువుతున్నాడు. మల్లికార్జున్ ఇంట్లో ఉండడం కన్నా బయటకు వెళ్లి సరదాగా గడపడాన్ని ఇష్టపడుతాడు.

గురువారం ఉదంయ 11 గంటలకు కొడుకులిద్దరినీ ఇంట్లో ఉంచి బయట తాళం వేసి ఆస్పత్రికి వెళ్లారు. అన్నం తిన్న తర్వాత చిన్న కుమారుడ నిద్రించాడు. మల్లికార్జున్ మాత్రం మంచానికి, కిటికీ ఊచలకు చున్నీని కట్ిట ఊయల ఊగసాగాడు. 

ప్రమాదవశాత్తు మంచం జారడంతో చున్నీ అతని మెడకు చుట్టుకుంది. నిద్రిస్తున్న సోదరుడు లేచి చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేశాడు. బయటి నుంచి తాళం వేసి ఉండడంతో కిటికీకి చున్నీతో వేలాడుతున్న మల్లికార్జున్ ను దింపాలని తమ్ముడికి సైగల ద్వారా చెప్పారు. దాంతో మెడకు చుట్టుకున్న చున్నీ విప్పడంతో మల్లికార్జున్ కిందకు జారి పడ్డాడు.

సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. తన కుమారుడు ఐరన్ పైప్ కు చున్నీితో మెడకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసుులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.