ఆడపిల్లలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

హైదరాబాద్ బంజారాహిల్స్‌ అంబేద్కర్‌నగర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నాలుగేళ్ళ చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన ఈ విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యలు వాపోతున్నారు.