బాలాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌లోని ఓ కంపెనీలో బాయిలర్ భారీ శబ్ధంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.  వెంటనే స్పందించిన తోటి కార్మికులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గత సోమవారం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో నలుగురు కార్మికులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

read also: జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఇద్దరి మృతి