ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సీరియస్ గా ఉన్నవారు మాత్రమే ఆస్పత్రిలో చేరుతున్నారు. లక్షణాలు లేనివారు.. లేదా స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో.. ఇమ్యూనిటి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాత్రివేళ పడుకునే ముందు పాలల్లో పసుపు కలుపుకొని తాగాలని నిపుణులు చెబుతున్నారు.

పాలల్లో పసుపు కలుపుకోని తాగడం వల్ల ఏం జరుగుతుంది..? అసలు ఎందుకు తాగాలో మనం ఇప్పుడు చూద్దాం..

పాలు ఆరోగ్యానికి మంచిది ఈ విషయం మనకు తెలుసు. అదేవిధంగా పసుపులోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పాల ద్వారా మన శరీరానికి అవసరమైన అన్ని పౌష్టికాహారాలు అందితే.. పసుపుతో మనకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

పసుపు శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో చాలా ఉపయోగపడుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. పసుపును తీసుకోవడం వలన జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోస సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తమా వ్యాధికి మంచిగా దోహదపడుతుంది.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారిని పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మహిళలకు రుతు సమయంలో వచ్చే కడుపునొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి. హార్మోన్ల సమస్యలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ వంటి వ్యాధులు దరిచేరవు. పేగులలోని క్రిములను తొలగించుటలో చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

అందుకే.. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని తాగితే మంచిదని పెద్దలు చెబుతారు. ఇలా తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరిగి.. వైరస్ లపై పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ దీనిని పాటించడం ఉత్తమం. వీటికి తోడు కొద్దిగా మిరియాల పొడి కూడా జత చేస్తే మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు.