మండుతున్న ఎండలో మీ శరీర వేడిని తగ్గించుకోవడానికి, చల్లగా ఉండటానికి.. మీ కోసం కొన్ని చిట్కాలు
ఎండలు మండిపోతున్నయ్.. ఉదయం 9 గంటల నుంచే ఇంట్లోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఎండల వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా దారుణంగా పెరుగుతుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

మండుతున్న ఎండల వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. కొన్ని ఆహారాలు కూడా బాడీ టెంపరేచర్ పెరిగేందుకు దారితీస్తాయి. పెద్దలకు సాధారణ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 98.6 డిగ్రీల ఫారెన్ హీట్ గా పరిగణించబడుతోంది. అయినప్పటికీ వ్యక్తికి వ్యక్తికి దీనిలో తేడాలు ఉండొచ్చు. ఒక వ్యక్తి శరీర ఉష్ణోగ్రత రోజంతా మారుతూ ఉంటుంది. అంటే తగ్గొచ్చు..లేదా పెరగొచ్చు. శారీరక శ్రమ, హార్మోన్ల హెచ్చుతగ్గులు, పర్యావరణ ఉష్ణోగ్రతతో సహా ఎన్నో కారకాలు మన బాడీ టెంపరేచర్ ను పెంచుతాయి. మండే వేసవిలో శరీర వేడిని తగ్గించడానికి ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీర వేడిని తగ్గించే మార్గాలు
ఈ కాలంలో పుష్కలంగా నీటిని తాగాలి. అలాగే ఇతర ద్రవాలను తాగాలి. అప్పుడే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే నిర్జలీకరణం బారిన పడే అవకాశం ఉండదు. వడగాల్పులను ఎదుర్కోవడానికి ఇంకా ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వదులుగా ఉండే దుస్తులను ధరించండి
ఎండాకాలంలో కాటన్ లేదా లినిన్ తో తయారు చేసిన తేలికపాటి, వదులుగా ఉండే దుస్తులనే వేసుకోవాలి. చర్మానికి గాలికి తగిలే వాటినే వేసుకోవాలి. శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఇవి సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
చల్లగ ఉండే ప్రాంతాలలో ఉండండి
బయట వేడిగా ఉన్నప్పుడు.. విశ్రాంతి తీసుకోవడానికి చల్లగా, నీడ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఉండండి. సూర్యరశ్మి డైరెక్ట్ గా మీపై పడితే వడదెబ్బ తగలడంతో పాటుగా బాడీ టెంపరేచర్ పెరిగి ఎన్నో సమస్యలు వస్తాయి.
తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలు
ఎండాకాలంలో భారీ వ్యాయామాలను చేయడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. కండరాలు కూడా ఎక్కువ పనిచేస్తాయి. ఫలితంగా శరీరం ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ సీజన్ లో వ్యాయామాల తీవ్రతను తగ్గించండి. ఇది శరీర వేడిని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
స్నానం చేయండి
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి చన్నీటి స్నానం కూడా సహాయపడుతుంది. ఈ సీజన్ లో చన్నీటి స్నానం శరీర వేడిని తగ్గించడానికి, చెమట, అలసట వంటి లక్షణాల నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.
చల్లని కంప్రెస్లను ఉపయోగించండి
నుదిటి, మెడ లేదా శరీరంలోని ఇతర ప్రాంతాలను చల్లని, తడి టవల్ తుడవండి. ఆ ప్రాంతాలపై కాసేపు పెట్టండి. ఇది శరీర వేడిని తగ్గించడానికి, వేడి సంబంధిత లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
కూలింగ్ ఫుడ్స్
శరీర వేడిని తగ్గించడానికి ఆహారాలు కూడా సహాయపడతాయి. అందుకే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, వేడి సంబంధిత లక్షణాలను తగ్గించడానికి పుచ్చకాయ, దోసకాయ లేదా పుదీనా వాటర్ ను తీసుకోండి.
శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే వీటికి దూరంగా ఉండండి
- శరీరాన్ని అలసిపోయేలా చేసే కార్యకలాపాలు, వ్యాయామాలలో పాల్గొనడం మానుకోండి. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉండే సమయంలో..
- ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం మానుకోండి. సాధ్యమైనంతవరకు చల్లని, నీడ ఉన్న ప్రాంతాల్లోనే ఉండండి.
- వేడి, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి మీ శరీర వేడిని పెంచుతాయి.
- ఆల్కహాల్, కెఫిన్ ను ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే ఇవి మీ శరీరాన్ని నిర్జలీకరణం బారిన పడేలా చేస్తాయి. వేడి, అలసట లేదా వడదెబ్బ లక్షణాలను మరింత ఎక్కువ చేస్తాయి.
- టైట్ గా ఉండే బట్టలను అసలే వేసుకోకండి. ఎందుకంటే ఇవి వేడిని ట్రాప్ చేస్తాయి. శరీరాన్ని వేడిగా ఉంచుతాయి.