ఈ రోజుల్లో చిన్న వయసు వారికి కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. నిజానికి ఇలా గుండె జబ్బులు రావడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు.
కీళ్లు నొప్పులు, శ్వాసకోస సమస్యలు, మూత్రపిండాలు, కాలెయ సమస్యల మాదిరిగానే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు గుండె జబ్బులు 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే వచ్చే. ఇవి రాను రాను 40 నుంచి 20, 25 ఏండ్ల వారికి కూడా గుండె పోటు, స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గుండె సమస్యలు ప్రాణాలను చాలా సులువుగా తీసేస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే గుండెను హెల్తీగా ఉంచుకోవాలి. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. కొన్ని అలవాట్లు మిమ్మల్ని గుండె జబ్బులకు దూరంగా ఉంచుతాయి. అవేంటంటే..
నడక
నడక.. నడక.. నడక.. మన పాణానికి ఇది ఎంతో అవసరం. ఎందుకంటే నడకతోనే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. రోజూ కొద్దిసేపు నడిస్తే గుండె ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. ఈ నడక మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు ఓవర్ వెయిట్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ముఖ్యంగా గుండెను రిస్క్ లోకి నెట్టే ఒత్తిడి స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం
మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజూ నడవడంతో పాటుగా ఈత కొట్టడం, జాగింగ్, రన్నింగ్, ఎరోబిక్స్, యోగా వంటివి చేయండి. లిఫ్ట్ కు బదులుగా మెట్లను ఎక్కడం, దిగడం చేయండి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
సమతుల్య ఆహారం
సమతుల్య ఆహారం కూడా మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ తాజా పండ్లు, కాయలు, కూరగాయలు, బీన్స్, కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలను తినండి. సోడియం కంటంట్ ను తగ్గించండి. ఇది రక్తపోటును పెంచుతుంది. దీంతో మీ గుండె ప్రమాదంలో పడుతుంది. అందుకే సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకండి.
నీటిని పుష్కలంగా తాగండి
నీటిని సర్వ రోగ నివారిణీ అంటారు. ఇందుకోసం మీరు రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది.
స్మోకింగ్, ఆల్కహాల్ కు నో చెప్పండి
స్మోకింగ్ రక్తనాళాలు మూసేస్తుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే స్మోకింగ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇకపోతే ఆల్కహాల్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది స్థూలకాయానికి దారితీస్తుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
