బెల్లీ ఫ్యాట్ లేదా విసెరల్ కొవ్వును కరిగించడం చాలా కష్టం. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల లేని పోని రోగాలు కూడా వస్తాయి. అతిగా తినడం, ఏదిపడితే అది లాగించడం, శారీరక శ్రమ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ రోజుల్లో ఊబకాయం ఎంత కామన్ గా మారిందో బెల్లీ ఫ్యాట్ కూడా అంతేకామన్ అయిపోయింది. నిజమేంటంటే శరీరంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండెపోటు, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు, డయాబెటీస్ వరకు ఎన్నో రోగాలు వస్తాయి. అయితే పొత్తికడుపు కొవ్వు లేదా విసెరల్ కొవ్వును తగ్గించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కొంతమంది ఇది కరగాలన్ని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఇది అస్సలు కరగదు. అయితే వ్యాయామం లేకపోవడం, ఇష్టారీత్యా తినడం వల్లే ఇలా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని పానీయాలను పరిగడుపున తాగితే బెల్లీ ఫ్యాట్ ఇట్టే తగ్గిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు, పుదీనాతో చేసిన టీ
ఎలాంటి పానీయాన్ని ఎప్పుడూ ట్రై చేసి ఉండరు కదా.. కానీ పసుపు, పుదీనాతో చేసిన టీని తాగితే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పసుపులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉండే పసుపు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. పసుపు కేలరీలను కరిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇకపోతే పుదీనాలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కూడా పొత్తికడుపు కొవ్వును ఇట్టే తగ్గిస్తాయి. దీని కోసం ముందుగా ఒక కప్పు నీటిని తీసుకుని మరిగించండి. దానిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని పుదీనా ఆకులను వేయండి. 4-5 నిమిషాల పాటు బాగా కలపండి. ఆ తర్వాత వడకట్టి తాగండి. అయితే మీరు కావాలనుకుంటే దీనిలో కొద్దిగా తేనెను కూడా కలుపుకుని తాగొచ్చు.
చియా విత్తనాలు, నిమ్మకాయ నీరు
చియా విత్తనాలు, నిమ్మకాయ నీరు ఈ రెండు మీరు సులువుగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. లెమన్ వాటర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ డ్రింక్ ను ఎలా తయారుచేయాలంటే.. ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. రుచి కోసం మీరు ఒక చెంచా తేనెను కూడా దీనిలో కలపొచ్చు. దీనికి కొద్దిగా చియా సీడ్స్ ను జోడించండి. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. ఫ్యాట్ కూడా కరుగుతుంది.
జీలకర్ర నీళ్లు
జీలకర్ర నీళ్లు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ముందుగా ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి కలపండి. ఈ నీటిని రాత్రంతా అలాగే నానబెట్టండి. ఉదయాన్నే పరగడుపున తాగితే బెల్లీ కొన్ని రోజుల్లోనే కరిగిపోతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కెఫిన్ కంటెంట్ ఉండదు. ఈ గ్రీన్ టీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, బరువును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. అందుకే వెయిట్ లాస్ కావాలనుకునేవారు గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగండి.
