Asianet News TeluguAsianet News Telugu

కరివేపాకే కదా అని తీసేయకండి.. ఈ ఆహరాలతో ఎన్ని లాభాలో..!

మనకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే ప్రకృతి ఇచ్చే సంపదలో ఏ ఏ పదార్ధాలు తింటే దేనికి ప్రయోజనం కలుగుతుంది

these foods boost your immunity system
Author
Hyderabad, First Published Jun 1, 2020, 11:29 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

these foods boost your immunity system

మనకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే ప్రకృతి ఇచ్చే సంపదలో ఏ ఏ పదార్ధాలు తింటే దేనికి ప్రయోజనం కలుగుతుంది అనే విషయంలో కిన్నింటి గురించి తెలుసుకుందాం,ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.   

• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

• బ్లాక్ 'టీ' మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

• మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

• బీట్ రూట్ బీపీని క్రమబద్దీకరిస్తుంది.

• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

• పుచ్చకాయలో ఉండే లైకొపీన్ గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

• కరివేపాకు ఎక్కువగా తింటే జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.

• అన్ని ఆకుకూరలు అన్ని ఆరోగ్యానికి ఎన్నో మేలును ,విటమిన్స్ ను అందిస్తాయి.

• పూదిన కఫాన్నిహరించి, జ్వరం రాకుండా కాపాడుతుంది.

• ఉల్లి పొరక చలువ చేస్తుంది.  

• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

• బచ్చలి ఆకు తింటే పొటాషియం,పాస్పరస్ మరియు హై ప్రోటిన్స్ ను అందిస్తాయి.

• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

• ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.

• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios