Asianet News TeluguAsianet News Telugu

ఏ బ్లడ్ గ్రూప్ వారికి హార్ట్ ఎటాక్ ప్రమాదం ఎక్కువ తెలుసా?

రక్తం   మానవ శరీర స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి తన బ్లడ్ గ్రూప్ కారణంగా అనేక వ్యాధులకు గురవుతాడు. ఈ రోజు మనం ఏ బ్లడ్ గ్రూప్ వారికి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందో చూద్దాం.

The risk of heart attack is high for this blood group ram
Author
First Published Aug 31, 2023, 4:04 PM IST

ఇటీవలి కాలంలో ఆహారపుటలవాట్లు, సరైన జీవనశైలి, చెడు అలవాట్లు వంటి కారణాల వల్ల అనేక వ్యాధులు నేడు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. మన ఆహారపు అలవాట్లతో పాటు కలుషిత వాతావరణం కూడా దీనికి కారణం.


వ్యాధి క్రిములు మన జీవనశైలి,  వాతావరణం ద్వారా వ్యాప్తి చెందుతాయని మనందరికీ తెలుసు. అయితే రక్తం గ్రూపును బట్టి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని  మీకు తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఆయా బ్లడ్ గ్రూపులు కూడా విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి. రక్తం   మానవ శరీర స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి తన బ్లడ్ గ్రూప్ కారణంగా అనేక వ్యాధులకు గురవుతాడు. ఈ రోజు మనం ఏ బ్లడ్ గ్రూప్ వారికి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందో చూద్దాం.

గుండె జబ్బులు, గుండె సంబంధిత సమస్యలు: A, B , AB బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులు ABO జన్యువును కలిగి ఉంటారు. ఇతర బ్లడ్ గ్రూపులు ఉన్నవారి కంటే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కలుషిత పరిసరాలకు వెళ్లినప్పుడు లేదా నివసించినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ బ్లడ్ గ్రూపులో గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. ఇది గుండెను గట్టిపరుస్తుంది. ధమనులను పలుచగా చేసి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి సమస్య: మెదడు సరిగ్గా పనిచేసినప్పుడే ఒక వ్యక్తి ఏదైనా చేయగలడు. ఒకసారి అతని మెదడు క్రియారహితంగా ఉంటే అతను ఏమీ చేయలేడు. మెదడు బాగా పని చేస్తే జ్ఞాపకశక్తి కూడా బాగా పనిచేస్తుంది. శరీరంలోని అనేక భాగాలు మెడల్ సందేశంపై పనిచేస్తాయి.

బ్లడ్ గ్రూప్ O, B , AB బ్లడ్ గ్రూప్‌లతో పోలిస్తే A, B, AB బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వ్యక్తులు జ్ఞాపకశక్తి కోల్పోవడం , మెదడు సంబంధిత సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. A, B , AB బ్లడ్ గ్రూపులకు కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.


ఒత్తిడి: కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా చాలా టెన్షన్ పడటం మనం చూస్తుంటాం. అలాంటి ఒత్తిడికి కారణం వారి బ్లడ్ గ్రూప్. టైప్ A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను పెంచుతుంది. దీని కారణంగా, A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అలాంటి ఒత్తిడి నుంచి బయటపడటం వారికి కష్టమే.

ఇతర బ్లడ్ గ్రూపుల కంటే A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికే క్యాన్సర్ వస్తుందని అర్థం కాదు, ఇది కాకుండా, క్యాన్సర్‌కు అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios