ఒకప్పుడు 100 ఏండ్ల పైబడే బతికేవారు. అదికూడా ఎలాంటి నొప్పి, రోగం లేకుండా. ఇప్పుడు 50 నుంచి 60 ఏండ్లకే కన్నుమూస్తున్నారు. అందులోనూ చిన్నవయసులోనూ ఎన్నో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కొన్ని ఆహారాలను తింటే ఆయుష్షు పెరగడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంటారు.
సమతుల్య ఆహారాన్ని తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెప్తుంటారు. కానీ ప్రతి ఒక్కరూ ప్రతి పోషకాన్ని ఖచ్చితంగా తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కొన్ని విటమిన్లు లోపించొచ్చు. కానీ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి చాలా అవసరం. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలాంటి ఫుడ్ మనం ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతికేందుకు కూడా సహాయపడుతుంది. దీర్ఘాయుష్షు కోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లూబెర్రీలు
బ్లూబెర్రీల్లో ఫైబర్, మాంగనీస్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఒక్క బ్లూ బెర్రీల్లోనే ఉంటాయి. అవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి, గుండె జబ్బులను నివారిస్తాయి.
గోజీ బెర్రీలు
గోజీ బెర్రీల గురించి తెలిసిన వారు తక్కువే. కానీ వీటిలో ఎన్నో రకాల ఫ్లేవనాయిడ్లతో పాటుగా విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు చాలా చిన్నగా ఉంటాయి. ఈ పండ్లను తింటే మీ కాలేయం, కళ్ళు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఆకుకూరలు
ఆకు కూరలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కాలే, బచ్చలికూర, కొల్లార్డ్ వంటి ఆకుకూరలను తప్పకుండా తినండి. ఈ ఆహారాలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కెరోటినాయిడ్లు, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
సాల్మన్
సాల్మన్, ట్రౌట్, హెర్రింగ్ వంటి ఇతర ఫ్యాటీ ఫిష్ లల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అసాధారణ హృదయ స్పందనల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. చేపలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గింజలు
వాల్ నట్స్, బాదం వంటి గింజల్లో మొక్కల ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
క్రూసిఫరస్ కూరగాయలు
బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొల్లార్డ్ ఆకుకూరలు, కాలే, టర్నిప్స్ వంటి కూరగాయలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. క్రూసిఫరస్ కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఇండోల్స్, నైట్రైల్స్, థియోసైనేట్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి.
