పెరిగిన కొలెస్ట్రాలే మనలో ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. గుండె పోటు నుంచి అధిక రక్తపోటు వరకు ఇది ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ మొత్తంలో పెరిగితే భవిష్యత్తులో ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. అందుకే హై కొలెస్ట్రాల్ ను ఎప్పుడూ చిన్న సమస్యగా భావించకూడదు. కొలెస్ట్రాల్ లెవల్స్ లో ఏ మాత్రం మార్పులు వచ్చిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తే ముందుగా మీరు చేయాల్సిన పని ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ను కూడా తాగకూడదు. మంచి జీవన శైలి అలవాట్లతో చెడు కొలెస్ట్రాల్ ను తొందరగా తగ్గించుకోవచ్చు.
మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్. రెండు చెడు కొలెస్ట్రాల్ . మంచి కొలెస్ట్రాల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ మంచి కొలెస్ట్రాల్ తగ్గినా.. చెడు కొలెస్ట్రాల్ పెరిగినా లేని పోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ మన పాణానికి అస్సలు మంచిది కాదు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులతో పాటుగా ఎన్నో రోగాలు వస్తాయి. మరి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్ మీట్
ఎర్ర మాంసం, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. సంతృప్త కొవ్వులు తీసుకోవడం తగ్గిస్తే ఆటోమెటిక్ గా "చెడు" కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కుకీలు, కేకుల్లో సాధారణంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ముఖ్యంగా పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా చాలా మంచివి. ఇవి ఫిష్ ఆయిల్, సీఫుడ్ సప్లిమెంట్లలో ఎక్కువగా ఉంటాయి. పలు పరిశోధనల ప్రకారం.. పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి. అంతేకాదు పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు టైప్ 2 డయాబెటిస్, జీవక్రియ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
వ్యాయామం
వ్యాయామం ఎన్నో రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. మితమైన శారీరక శ్రమ.. అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (హెచ్డిఎల్) కొలెస్ట్రాల్ ను తగ్గించి, "మంచి" కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం వారానికి ఐదుసార్లు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. లేదా వారానికి మూడుసార్లు 20 నిమిషాల తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామం సాధన చేయండి.
బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలి
స్థూలకాయం ఉన్నవారి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకే బరువును కంట్రోల్ లో ఉంచుకోండి.
