చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి, మూడ్ స్వింగ్స్, అలసట వంటి సమస్యలను ఎప్పుడూ ఎదుర్కొనే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవన్నీ మీ శరీరంలో ఒక పోషకం లోపిస్తేనే వస్తాయన్న సంగతి మీకు తెలుసా?  

మన శరీరం ఎన్నో మార్పులకు లోనవుతూ ఉంటుంది. మన శరీరాన్ని పోషించడానికి, ఆరోగ్యంగా ఉంచేందుకు మనకు విటమిన్లు, ఖనిజాలు అవసరపడతాయి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా.. మన శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాగా మన శరీరానికి కావాల్సిన విటమిన్లలో విటమిన్ బి6 కూడా ఒకటి. ఇది లేకపోవడం వల్ల చర్మం నుంచి మానసిక ఆరోగ్యం వరకు శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ బి 6 కారణంగానే మనం తినే ఆహారం శక్తిగా మారుతుంది. ఇది ప్రోటీన్ ను విచ్ఛిన్నం చేయడానికి, శరీరం ఉత్తమంగా పనిచేయడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ దీన్ని సరైన నిష్పత్తిలో తినప్పుడు మన శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే.. 

స్కిన్ రాషెస్

చర్మంపై దురదగా అనిపిస్తుందా? అలాగే మీ చర్మం ఎర్రగా మారుతోందా? అయితే ఇది ఖచ్చితంగా విటమిన్ బి 6 లోపానికి హెచ్చరిక సంకేతమే కావొచ్చంటున్నారు నిపుణులు. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కొల్లాజెన్ ను సంశ్లేషణ చేయడానికి విటమిన్ బి 6 సహాయపడుతుంది. కాబట్టి ఇది లోపిస్తే చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. నెత్తిమీద, మెడ, ముఖం, ఛాతీ మొదలైన వాటిపై ఈ సమస్యలు కనిపిస్తాయి. 

గొంతునొప్పి

విటమిన్ బి 6 లేకపోవడం వల్ల పెదవులు వాపు వస్తాయి. అలాగే ఎర్రగా మారుతాయి. కొన్ని కొన్ని సార్లు పెదాలు పగుళ్లు కూడా వస్తాయి. ఇది రక్తస్రావం, సంక్రమణకు దారితీస్తుంది. అలాగే తినడానికి, తాగడానికి కూడా ఇబ్బందిగా, బాధగా కూడా ఉంటుంది. 

మూడ్ స్వింగ్స్

మూడ్ స్వింగ్స్ కు కారణాలెన్నో ఉన్నాయి. అయితే విటమిన్ బి 6 లేకపోవడం వల్ల కూడా మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఇది నిరాశ, ఆత్రుత, చిరాకు మొదలైన వాటికి దారితీస్తుంది. ఆందోళన, నిరాశ, నొప్పి భావాలను నియంత్రించడానికి సహాయపడే సెరోటోనిన్, గామా-అమైనోబ్యూటిరిక్ ఆమ్లం వంటి అనేక న్యూరోట్రాన్స్మిటర్లను తయారు చేయడానికి మన శరీరానికి విటమిన్ బి 6 అవసరం.

అలసట

ఈ విటమిన్ లోపం వల్ల మీరు ఎప్పుడూ అలసిపోతారు. అలాగే ఎప్పుడూ నిద్రపోతారు. మీ కణాలకు తగినంత ఆక్సిజన్ లభించకపోతే రక్తహీనత సమస్య వస్తుంది. దీనివల్ల మీకు అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. హిమోగ్లోబిన్ తయారీలో విటమిన్ బి 6 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీ ఎర్ర రక్త కణాలలోని ప్రోటీన్. ఇది మీ శరీరమంతా ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.

బలహీనమైన రోగనిరోధక పనితీరు

బలమైన రోగనిరోధక వ్యవస్థ అంటువ్యాధులు, వాపును నివారిస్తుంది. విటమిన్ బి 6 తో సహా ఇతర పోషక లోపాలు మీ రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. దీనివల్ల మీకు ఎన్నో రోగాలు వస్తాయి.