యువతలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనారోగ్యకరమైన జీవన శైలే ఇందుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే?
pancreatic cancer: ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణంగా ఎలాంటి లక్షణాలను చూపించదు. ఒకవేళ లక్షణాలు ఉన్నా అవి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సంకేతాలుగా గుర్తించడం చాలా కష్టం. 53 మంది పురుషులలో ఒకరు, 57 మంది మహిళల్లో ఒకరు ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. జన్యు కారకాలు, వయస్సు, జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. 35- 39 వయస్సు , 60-64 వయసులో ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 85-89 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు, సంకేతాలు
- కామెర్లు: మీ కళ్ళు లేదా మీ చర్మం రంగు పసుపు రంగులోకి మారుతుంది. చర్మం దురద పెట్టడం, మూత్రం ముదురు రంగులో రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ఆకలి లేకపోవడం లేదా ఎలాంటి ప్రయత్నం చేయకుండా బరువు తగ్గడం
- అలసటగా అనిపించడం, శక్తి లేకపోవడం
- అధిక ఉష్ణోగ్రత, లేదా వేడిగా అనిపించడం, వణకడం
- అనారోగ్యంగా అనిపించడం లేదా అస్వస్థతకు గురికావడం
- విరేచనాలు, మలబద్ధకం
- మీ కడుపు, వీపు పై భాగంలో నొప్పి. ఇది ఎక్కువగా తినేటప్పుడు లేదా పడుకున్నప్పుడు వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ముందుకు వంగితే నొప్పి తగ్గినట్టుగా అనిపిస్తుంది.
- ఉబ్బినట్లు అనిపించడం వంటి అజీర్ణం లక్షణాలు
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు కారణాలు
- పొగాకు, ధూమపానం
- వయస్సు - ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన పెద్దలకే వస్తుంది.
- డయాబెటిస్- ముఖ్యంగా కొత్తగా నిర్ధారణ అయిన డయాబెటిస్
- అండాశయ లేదా పెద్దప్రేగు క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉండటం
- దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్
- మద్యం ఎక్కువగా తాగడం
- ఊబకాయం
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత మీరు షాక్ కు గురికావొచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ ప్రతి వ్యక్తిని భిన్నంగా ప్రభావితం చేస్తుంది.
