పియర్ పండు గురించి తెలియని వారుండరు. ఈ పండులో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని తింటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు మాత్రం ఈ పండుకు వీలైనంత దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పియర్ పండు టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటుంటారు. ఈ పండును మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదే దీనిలో యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. పియర్ పండ్లలో ఉండే విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు దీనిలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ పండు బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పండు మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక పోతే ఈ పండును తింటే మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు ఈ పండు జీర్ణసమస్యలను కూడా తగ్గిస్తుంది. మలబద్దకంతో బాధపడేవారికి ఈ పండు మెడిసిన్ లా పనిచేస్తుంది. ఒక్కటేమిటీ ఈ పండుతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఈ పండుకు వీలైనంత దూరంగా ఉండాలి. వాళ్లు ఎవరెవరంటే?
అజీర్థి సమస్యలు
ఈ రోజుల్లో చాలా మంది అజీర్థి సమస్యను ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవారు పియర్స్ ను తినకూడదు. ఎందుకంటే ఇవి జీర్ణసమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఉదయం, రాత్రిపూట వీటిని మొత్తమే తినకూడదు. ఒకవేళ తింటే గ్యాస్ట్రిక్, విరేచనాలు, అపానవాయువు (పిత్తులు) వంటి సమస్యలు వస్తాయి.
జలుబు
చలికాలంలోనే కాదు మిగతా కాలాల్లో కూడా అప్పుడప్పుడు జలుబు అవుతుంది. జలుబు చాలా కామన్. అయితే జలుబు ఉన్నవారు చలువ చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. లేదంటే జలుబు ఎక్కువవుతుంది. అయితే పియర్ పండు కూడా మనకు చలువ చేస్తుంది. దీన్ని తింటే సమస్య ఎక్కువవుతుంది. అందుకే జలుబు ఉన్నవారు పియర్ పండును తినకపోవడమే మంచిది.
బరువు తగ్గాలనుకునే వారు
బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి బరువును పెంచుతాయి కాబట్టి. అయితే వెయిట్ లాస్ కావాలనుకునే వారు పియర్ పండ్లను కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో కేలరీలు తక్కువగా ఉన్నా.. వీటిని మోతాదుకు మించి తింటే కేలరీల వినియోగం పెరిగి బరువు పెరిగే ఛాన్స్ ఉంది.
అధిక రక్తపోటు పేషెంట్లు
నిజానికి పియర్స్ హై బీపీ పేషెంట్లకు చాలా మంచివి. ఎందుకంటే ఇవి రక్తపోటును నియత్రిస్తాయి. ఈ కారణం వల్లనే చాలా మంది వీటిని మోతాదుకు మించి తింటుంటారు. కానీ వీటిని ఎక్కువగా తింటే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె కొట్టుకునే వేగం పెరగడం, మైకము, శ్వాస సమస్యలు, మూర్చ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
