అధిక రక్తపోటు ప్రాణాంతక వ్యాధి. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమందిలో తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. దీనికి అసలు కారణాలేంటో తెలుసా?  

రక్తపోటు అనేది మన శరీరమంతటా రక్తాన్ని పంప్ చేయడానికి మన గుండె ఉపయోగించే శక్తి. అయితే రక్తపోటులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సిస్టోలిక్, రెండు డయాస్టోలిక్, గుండె కొట్టుకున్నప్పుడు పీడనం గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు సిస్టోలిక్ ను కొలుస్తారు. పీడనం తక్కువగా ఉన్నప్పుడు డయాస్టోలిక్ ను కొలుస్తారు. అయితే ఉండాల్సిన దానికంటే రక్తపోటు పెరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అయితే కొన్ని సార్లు రక్తపోటు అకస్మత్తుగా పెరిగిపోతుంది. దీనికి కారణాలేంటంటే..

ఒత్తిడి

అకస్మత్తుగా రక్తపోటు పెరగడానికి ఒత్తిడి ఒక సాధారణ కారణం. పలు పరిశోధన ప్రకారం.. ఒత్తిడి వల్ల యువతలో తాత్కాలికంగా రక్తపోటు పెరిగిపోతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం ఎన్నో హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది కొద్దిసేపటి వరకే ఉన్నా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. 

అనారోగ్యకరమైన ఆహారం, ఆల్కహాల్ అలవాటు

తాత్కాలికంగా రక్తపోటు పెరగడానికి ఒత్తిడి ఒక సాధారణ కారణం అయితే మందును ఎక్కువగా తాగడం, కెఫిన్ ను మోతాదుకు మించి తీసుకోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, హెవీగా తినడం, శారీరక శ్రమలో పాల్గొనకపోవడం వంటివి ఒత్తిడికి సంబంధించిన జీవనశైలి అలవాట్లు కూడా రక్తపోటును పెంచుతాయి. 

కొన్ని మందులు

కొన్ని రకాల మందులు కూడా రక్తపోటును ఉన్నపాటుగా పెంచేస్తాయని తెలుసా? అంతేకాదు మీకు ఇప్పటికే అధిక రక్తపోటు సమస్య ఉంటే మీరు తీసుకునే మందుల గురించి తెలుసుకోండి. ఇవి కూడా మీ బీపీని పెంచే అవకాశం ఉంది. డీకోంగెస్టెంట్లు ఉన్న మందులు కూడా రక్తపోటును పెంచుతాయి. 

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం

సోడియం ఎక్కువగా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్యాకేజీ, పులియబెట్టిన ఆహారాల్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిజ్జా, బ్రెడ్, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ ను తింటే మీ బీపీ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. 

అడ్రినల్ సమస్యలు

మన శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి అయ్యేందుకు అడ్రినల్ గ్రంథులే బాధ్యత వహిస్తాయి. ఇవి రెండు మూత్రిపండాలపైన చిన్నగా త్రిభుజాకారంలో ఉంటాయి. అతి చురుకైన అడ్రినల్ గ్రంథి రక్తపోటును పెంచతుంది.