Asianet News TeluguAsianet News Telugu

ఎండాకాలంలో మూత్రపిండాల వ్యాధులు రావొద్దంటే ఇలా చేయండి..

ఎండాకాలంలో మూత్రపిండాల వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో కొన్ని చిట్కాలను పాటిస్తే మూత్రపిండాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు. 
 

Protect your kidneys this summer: Tips for maintaining renal health rsl
Author
First Published Mar 30, 2023, 1:48 PM IST

ఎండాకాలంలో లేని పోని రోగాలు వస్తుంటాయి. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులు. మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్ లో హైడ్రేటెడ్ గా ఉండాలి. సూర్యరశ్మి నుంచి దూరంగా ఉండాలి. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతింటుంది. అలాగే బాడీ డీహైడ్రేట్ అయ్యి మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మూత్రపిండాలు దెబ్బతింటే మీ శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవు, అదనపు ద్రవాలు ఫిల్టర్ కావు. దీనివల్ల లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎండాకాలంలో మూత్రపిండాల  ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి టిప్స్ ను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 
హైడ్రేటెడ్ గా ఉండండి

ఎండాకాలంలో నీళ్లను సరిపడా తాగకపోతే మీ శరీరంలోని వ్యర్థాలు, విషాన్ని బయటకు తీయడానికి మీ మూత్రపిండాలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇది నిర్జలీకరణం నుంచి మూత్రపిండాల్లో రాళ్ల వరకు ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే రోజంతా పుష్కలంగా నీటిని తాగండి.  ముఖ్యంగా ఆరుబయట ఎక్కువగా ఉంటే నీటిని తరచుగా తాగుతూ ఉండండి. 

డైట్

ఎండాకాలంలో ఉప్పుగా ఉండే స్నాక్స్, చక్కెర పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవి మీ మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు పుష్కలంగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తినండి. ఈ ఆహారాలు మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి, నష్టాన్ని నివారించడానికి సహాయపడే అవసరమైన పోషకాలను అందిస్తాయి.

చర్మాన్ని రక్షించండి

సూర్యరశ్మి వల్ల మీ చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది మీ మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది. మీ చర్మం యువీ రేడియేషన్ ను గురైనప్పుడు ఇది విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి అవసరం. అయినప్పటికీ ఎక్కువ సూర్యరశ్మి చర్మం దెబ్బతినడానికి దారితీస్తుంది. ఇది ఈ ముఖ్యమైన పోషకాన్ని ఉత్పత్తి చేసే మీ మూత్రపిండాల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే బయట ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు సన్ స్క్రీన్ , టోపీలు, కాటన్ దుస్తులను ధరించండి. 

చురుకుగా ఉండండి

మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వ్యాయామం రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది మీ మూత్రపిండాల నుంచి విషాన్ని, వ్యర్థ ఉత్పత్తులను మరింత సమర్థవంతంగా బయటకు తీయడానికి సహాయపడుతుంది. ఇది మంటను తగ్గించడానికి, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే ఈ ఎండాకాలంలో ఔట్ డోర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ లేదా పార్కులో వాకింగ్ చేయండి. ఎంత ఎక్కువ శారీరక శ్రమ చేస్తే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. 

మందులు

కొన్ని మందులు కూడా మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రత్యేకించి ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువ కాలంగా తీసుకుంటే. అందుకే మీరు తీసుకుంటున్న ఏదైనా మందుల గురించి, అవి మీ మూత్రపిండాల పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో వైద్యుడితో మాట్లాడండి. 

Follow Us:
Download App:
  • android
  • ios