Asianet News TeluguAsianet News Telugu

కరోనా టీకా తీసుకుంటే.. పడకగదిలో దూరం పాటించాలి..!

గర్భిణులు, హెచ్ఐవీ రోగులూ కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వీరు హై రిస్క్ జోన్ లో ఉంటారని పేర్కొంది.

Pregnant women agonize over whether to get coronavirus vaccine
Author
Hyderabad, First Published Jan 12, 2021, 12:55 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని సర్వత్రా ఎదురు చూశారు. కాగా..  ఆ రోజు రానే వచ్చింది. మన హైదరాబాద్ నగరానికి కూడా కరోనా వ్యాక్సిన్ చేరుకుంది. కాగా.. అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆతురత చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు కరోనా వ్యాక్సిన్ కి దూరంగా ఉండటం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

గర్భిణులు, హెచ్ఐవీ రోగులూ కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వీరు హై రిస్క్ జోన్ లో ఉంటారని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. వివాహితలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే వారు కనీసం మూడు నెలల పాటు గర్భధారణకు దూరంగా ఉండాలని సూచించింది.

ఇదిలా ఉండగా.. మంగ‌ళ‌వారం ఉద‌యం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్ర‌క్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు త‌ర‌లించారు. అక్క‌డ్నుంచి ప్ర‌త్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమాన‌శ్ర‌యానికి త‌ర‌లించారు. 6.5 ల‌క్ష‌ల డోసుల కొవిడ్‌ టీకాలు ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో రాష్ర్టానికి చేరుకున్నాయి. 

మ‌రికాసేప‌ట్లో శంషాబాద్ నుంచి కోఠిలోని శీత‌లీక‌ర‌ణ కేంద్రానికి టీకా డోసుల‌ను త‌ర‌లించ‌నున్నారు. కోఠి ఆరోగ్య కార్యాల‌యంలో 40 క్యూబిక్ మీట‌ర్ల వ్యాక్సిన్ కూల‌ర్ ఏర్పాటు చేశారు.

ఈ నెల 16 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభం కానుంది. రాష్ర్ట వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్‌కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను త‌ర‌లించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా వేయ‌నున్నారు.

 మొత్తంగా తొలుత 2.90 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్య సిబ్బందికి టీకా వేయ‌నున్నారు. వారంలో నాలుగు రోజులు వైద్య సిబ్బంది టీకాలు వేయ‌నుంది. బుధ‌, శ‌నివారాల్లో య‌థావిధిగా సార్వ‌త్రిక టీకాల కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది. ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు టీకా పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios