రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి యోగాసనాలు ఎంతో సహాయపడతాయి. కొన్ని యోగాసనాలైతే గుండెపోటును నివారిస్తాయి కూడా.
ప్రస్తుత కాలంలో వయసును బట్టి వచ్చే అనారోగ్య సమస్యలు లేవు. ఏజ్ తో సంబంధం లేకుండా అన్ని రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా గుండెజబ్బులు. ఒకప్పుడు వయసు మీద పడిన వారికి మాత్రమే గుండె జబ్బులు, గుండెపోటు వచ్చేది. ఇప్పుడు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లలకు కూడా గుండెపోటు వస్తోంది. ఈ గుండె పోటు ఎప్పుడు, ఎవరిని కబళిస్తుందో చెప్పలేం. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. గుండెపోటు రాకూడదంటే గుండెను ఆరోగ్యంగా ఉంచాలి. అయితే కొన్ని యోగాసనాలు గుండెను ఆరోగ్యంగా ఉంచి గుండెపోటును నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
భుజంగాసనం: దీనినే నాగుపాము భంగిమ అని కూడా పిలుస్తారు. భుజంగాసనం ప్రధానంగా ఉదర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే వెన్నును బలోపేతం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆసనంలో కడుపుపై పడుకుని, కాళ్లను చాచి, రెండు చేతులను నేలకు ఆనించి ఛాతీని పైకి లేపాలి.
గోముఖాసనం: ఈ భంగిమ ఒత్తిడిని తగ్గించడానికి, వెన్నెముకను బలోపేతం చేయడానికి, అధిక రక్తపోటుకు నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది కూర్చునే యోగా భంగిమ. దీనిలో కాళ్ళు జోడించి వెనుక వైపు చేతులను పట్టుకోవడానికి ప్రయత్నించాలి.
మలాసానం: స్థిరత్వం, ప్రశాంతతకు ఈ ఆసనం అవసరం. ఈ భంగిమలో మీ కాళ్లను వెడల్పుగా ఉంచి పాదాలను నేలపై చదునుగా ఉంచి స్క్వాట్ లాంటి పొజిషన్ లో ఉండాలి. తర్వాత మీ మోచేతులను మోకాళ్ళకు ఆనించాలి. అలాగే మీ అరచేతులను నమస్కారం పొజీషన్ లో పెట్టండి. ఈ యోగాసననం బరువు తగ్గడానికి, శరీరంలో రక్తాన్ని పంప్ చేయడానికి సహాయపడుతుంది.
తడాసనం: ఇది గుండెకు సహాయపడుతుంది. ఈ యోగా భంగిమ దిగువ వీపును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
వంతెన భంగిమ: ఈ యోగా భంగిమ మీ శరీరాన్ని బలోపేతం చేయడానికి, సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ముందుగా మీరు మీ వీపుపై పడుకోండి. మీ పాదాలను వెడల్పుగా ఉంచండి. మీ పాదాలను భూమికి ఆనించి మీ శరీరాన్ని పైకి లేపండి. అలాగే మీ అరచేతులను నేలకు అభిముఖంగా ఉంచి మీ చేతులను పక్కకు ఉంచాలి.
Paschimottasana: ఈ యోగాసనం కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉత్తమమైంది కూడా. మీ కాళ్ళను జోడించి కూర్చోండి. మీ చేతులు మీ అరకాళ్లను పట్టుకోవాలి. మీ కడుపు మీ తొడల పైభాగాన్ని తకడానికి ప్రయత్నించండి.
