టైం ప్రకారం పీరియడ్స్ కాకపోవడం, భరించలేని నొప్పి, బ్లీడింగ్ ఎక్కువ కావడం మొదలైన పీరియడ్స్ సమస్యలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నవారు వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరికీ పీరియడ్స్ సమయంలో ఏదో ఒక సమస్య వస్తుంది. బ్లీడింగ్ ఎక్కువ కావడం, కడుపు నొప్పి, పీరియడ్స్ లేట్ కావడం ఇలా ఏదో ఒక సమస్యను ఫేస్ చేస్తుంటారు. ఇవి కామనే అని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ నెలసరిలో కనిపించే మార్పులను ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి చిన్నవాటిలా కనిపించినా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలేంటంటే..?
భరించలేని నొప్పి
కొంతమందికి పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పేం రాదు. కానీ ఇంకొంతమందికి మాత్రం భరించలేనంత నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఐదు రోజుల దాకా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ను వాడాలి. కానీ ఇది మీ రోజు వారి లైఫ్ స్టైల్ ను ప్రభావితం చేస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీకు ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ మొదలైన సమస్యలు ఉండొచ్చు.
అధిక రక్తస్రావం
కొంతమంది మూడు రోజులు కూడా బ్లీడింగ్ కాదు. కానీ కొందరికి మాత్రం 7 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులే బ్లీడింగ్ అవుతుంది. ఇలా అయితే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తహీనతకు, సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఇలాంటి సమస్య మీకు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్
సాధారణంగా పీరియడ్స్.. 21 రోజుల ముందు, 35 రోజుల తర్వాత వస్తే వస్తే దాన్ని క్రమరహిత నెలసరిగా పరిగణిస్తారు. పీరియడ్స్ సక్రమంగా లేకపోయినా సమస్య కావొచ్చు. గర్భధారణ పాలిసిస్టిక్ అండాశయం, విపరీతమైన బరువు, జనన నియంత్రణ మాత్రల వాడటం వంటికవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణాలు. అందుకే మీరు ఈ సమస్యను ఫేస్ చేస్తే వైద్యుడిని తప్పక కలవండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు అసలు కారణం ఏంటో తెలుసుకోండి.
పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడం
పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడం, రక్తం రంగులో మార్పులు కూడా మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ రక్తం రంగు క్రాన్బెర్రీ మాదిరిగా ఎరుపు రంగులో ఉండాలి. దీనితో పాటు రక్తం గడ్డకట్టడం హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ ఫైబ్రాయిడ్లకు సంకేతం. మీ రక్తం తేలికగా, పల్చగా ఉంటే మీ శరీరంలో పోషకాల లోపం ఉందని అర్థం చేసుకోవాలి.
