Asianet News TeluguAsianet News Telugu

ఈ పాలలో కరోనా వైరస్ ఉండదు!

ఈ పాలను తల్లిపాలకు దూరమైన శిశువులకు ‘తల్లిపాల బ్యాంకు’ల ద్వారా ఇస్తారు. తల్లిపాలను దానం చేసే మహిళల నుంచి వాటిని సేకరించింది నిల్వ చేస్తారు. 
 

Pasteurizing breast milk inactivates covid19
Author
Hyderabad, First Published Jul 11, 2020, 11:09 AM IST

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ ఎలా ఎటు నుంచి ఈ వైరస్ ఎటాక్ చేస్తుందో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో ప్రజలు ఏది చేయాలన్నా భయపడిపోతున్నారు. బయట నుంచి వచ్చే పాలు, ఆహార పదార్థాల నుంచి కూడా కరోనా సోకుతుందంటూ అందరూ భయపడుతున్నారు. 

అయితే... పాశ్చరైజేషన్‌ చేసిన తల్లిపాలలో కొవిడ్‌-19 క్రియాశీలకంగా ఉండే అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పాలను తల్లిపాలకు దూరమైన శిశువులకు ‘తల్లిపాల బ్యాంకు’ల ద్వారా ఇస్తారు. తల్లిపాలను దానం చేసే మహిళల నుంచి వాటిని సేకరించింది నిల్వ చేస్తారు. 

ఈ క్రమంలో కరోనా సోకిన మహిళలు దానం చేసిన పాలను కూడా 62.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు పాశ్చరైజ్‌  చేసి, కొవిడ్‌-19ను క్రియాశీలకంగా ఉండకుండా చేయొచ్చని కెనడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పాలను శిశువులకు ఇవ్వడం సురక్షితమేనని కెనడియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో పేర్కొన్నారు. కాగా, తల్లికి కరోనా సోకితే శిశువుకు స్వయంగా పాలు ఇవ్వచ్చని ఇప్పటికే శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios