సారాంశం
విటమిన్ డి లోపం నుంచి ఊబకాయం వరకు.. కొన్ని సమస్యల వల్ల ఒంటి నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొంతమందికి నిద్రలేచిన వెంటనే శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పిగా ఉంటుంది. కండరాలలో నొప్పి, తీవ్రమైన తలనొప్పి లేదా శరీర నొప్పులు అనిపించినప్పుడు ఏ పని చేయడం చేతకాదు. నిద్రలేచిన తర్వాత ఒంట్లో నొప్పులు ఉంటే మీ పరుపు, నిద్ర స్థానం, బరువు, నిద్ర రుగ్మతలు, అంతర్లీన ఆరోగ్య సమస్యలతో సహా ఎన్నో కారణాలు ఉన్నాయి. నిద్రలేచిన వెంటనే ఎందుకు నొప్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్ డి లోపం
మీ శరీరంలో తగినంత విటమిన్ డి లేనప్పుడు హైపోకాల్సెమియా లేదా రక్తంలో కాల్షియం తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. మీ మూత్రపిండాలు, కండరాలు వంటి మీ శరీరంలోని ఎన్నో ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. మీ ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా కాల్షియం అవసరం. కాల్షియాన్ని గ్రహించడానపి మీకు తగినంత విటమిన్ డి అవసరం. ఈ విటమిన్ లోపిస్తే ఈ అవయవాలలో, మీ ఎముకలలో నొప్పి కలుగుతుంది.
రక్తహీనత
మీ శరీరం సక్రమంగా పనిచేయడానికి తగినన్ని ఎర్ర రక్త కణాలు లేనప్పుడు రక్తహీనత సమస్య వస్తుంది. అంటే మీ ఒంట్లో రక్తం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ శరీర కణజాలాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. రక్తహీనతతో మీ శరీరంలోని చాలా భాగాలు అలసటకు గురవుతాయి. ఎందుకంటే ఇవి ఆరోగ్యంగా ఉండటానికి లేదా సరిగ్గా పనిచేయడానికి తగినంత ఆక్సిజన్ ను పొందవు.
రక్తహీనత ఇతర లక్షణాలు: అలసట, అసాధారణ హృదయ స్పందన రేటు, మైకం లేదా దిక్కుతోచని స్థితి, తల లేదా ఛాతీ నొప్పి, చల్లని పాదాలు లేదా చేతులు, పాలిపోయిన రంగు చర్మం.
అధిక బరువు
అధిక బరువు మీ వీపు, మెడపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల నొప్పి వస్తుంది. అధిక బరువు ఉండటం నిద్ర, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది నిద్ర నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నిద్రలేచిన తర్వాత ఒళ్లు నొప్పులు వస్తాయి. బరువు తగ్గితే మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
నాణ్యత లేని పరుపు
స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. నాణ్యత లేని పరుపుపై నిద్రపోవడం శరీర నొప్పులకు ప్రధాన కారణాలలో ఒకటి.
నిద్రపోయే భంగిమ
మీరు నిద్రపోయే భంగిమ కూడా శరీరానికి నొప్పులను కలిగిస్తుంది. సాధారణంగా సైడ్ స్లీపింగ్ చాలా మందికి ఉత్తమంగా ఉంటుంది. ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి నిద్ర శ్వాస రుగ్మతలు ఉన్నవారికి.