జిమ్‌కు వెళ్లే ప్రతి ఏడుగురిలో ఒకరికి సంతానోత్పత్తి సమస్యలు.. పురుషులకు సరికొత్త సవాళ్లు, జాగ్రత్త పడకుంటే..?

కండలు పెంచే ధ్యాసలో వున్న వారికి తదనంతర కాలంలో చోటు చేసుకునే దుష్పరిణామాలు తెలియడం లేదు . తాజాగా జిమ్‌లకు వెళ్లే వారి సంతానోత్పత్తి వ్యవస్థపైనా వ్యతిరేక ప్రభావాలు చూపుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

One in seven male gym goers consider impact on fertility: Research ksp

నగరాలు, పట్టణాలు , పల్లెలు అన్న తేడా లేకుండా ప్రస్తుతం జిమ్‌కు వెళ్లేవారి సంఖ్య ఎక్కువైపోతోంది. పొట్టలు కరిగించేందుకు కొందరు, అమ్మాయిలను ఫ్లాట్ చేసేందుకు ఇంకొందరు, ఆరోగ్యంతో మరికొందరు జిమ్‌లకు పోటెత్తుతున్నారు. సాయుధ బలగాల్లో చేరేందుకు సిద్ధమవుతున్న వారైతే గంటల కొద్దీ జిమ్‌లోనే గడుపుతుంటారు. అయితే కండలు పెంచే ధ్యాసలో వున్న వారికి తదనంతర కాలంలో చోటు చేసుకునే దుష్పరిణామాలు తెలియడం లేదు. ఇటీవలి కాలంలో మితిమీరిన వర్కౌట్లు చేసే వారు గుండె జబ్బుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. వీరంతా 18 నుంచి 30 ఏళ్లు లోపే వాళ్లే కావడం ఆందోళనకరం. తాజాగా జిమ్‌లకు వెళ్లే వారి సంతానోత్పత్తి వ్యవస్థపైనా వ్యతిరేక ప్రభావాలు చూపుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

రిప్రొడక్టివ్ బయోమెడిసిన్ 152 మంది జిమ్ ఔత్సాహికులపై చేసిన సర్వే ఫలితాలను ఆన్‌లైన్‌లో ప్రచురించింది. దీని ప్రకారం 79 శాతం మంది పురుషులు ఉపయోగించే అధిక స్థాయి ఈస్ట్రోజెన్ వుండే ప్రోటీన్ సప్లిమెంట్‌లు సంతానోత్పత్తిపై కలిగించే నష్టాలపై పురుషులకు పెద్దగా అవగాహన లేదట. సంతానోత్పత్తి గురించి టెన్షన్ పడుతున్నారా అని ప్రశ్నించగా.. సగంపైగా పురుషులు (52 శాతం) తమ సంతానోత్పత్తి గురించి గతంలో ఆలోచించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఈ సర్వేలో పాల్గొన్న పురుషులలో కేవలం 14 శాతం మంది మాత్రమే సప్లిమెంట్ వాడకం వల్ల సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 

సంతానోత్పత్తి, సప్లిమెంట్‌లు రెండింట్లో ఏది ముఖ్యమని అడిగితే ఇందులో గణనీయమైన వ్యత్యాసం వుందని డేటా చూపింది. దీనిని 38 శాతం మంది అంగీకరించలేదు, అలాగే 28 శాతం మంది అంగీకరిస్తున్నారు. జిమ్‌లకు వచ్చే స్త్రీలు ఇదే సమయంలో పురుషుల సంతానోత్పత్తిపై అవగాహన కలిగి వున్నారు. బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మెయురిగ్ గల్లాఘర్ (అధ్యయనంపై ప్రధాన రచయిత) ఇలా అన్నారు. హెల్దీగా వుండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి వుండటం మంచిదేనని.. కానీ పురుషుల సంతానోత్పత్తి, ప్రోటీన్ సప్లిమెంట్ వాడకంపై ఆందోళన వుందన్నారు. విరిగిపోయిన పాలు, సోయా ప్రోటీన్‌ ఉత్పత్తులు స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజెన్‌ అధిక స్థాయిలకు పెంచుతుందన్నారు. పురుషుడు ఉత్పత్తి చేయగల స్పెర్మ్ పరిమాణం, నాణ్యతతో స్త్రీ హార్మోన్ చాలా సమస్యలను కలిగిస్తుందన్నారు. 

మార్కెట్‌లో దొరికే అనేక ప్రోటీన్ సప్లిమెంట్లు అనాబాలిక్ స్టెరాయిడ్స్ ద్వారా కలుషితమైనట్లు గుర్తించారు. వీటి వాడకం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడం, వృషణాలు కుచించుకుపోవడంతో పాటు అంగస్తంభనకు కారణమవుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుత తరంలో వంధ్యత్వం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వంధ్యత్వానికి సంబంధించిన కేసుల్లో పురుషులే ఎక్కువ బాధితులుగా వున్నారని నిపుణులు అంటున్నారు. 

తాజా అధ్యయనం ప్రకారం.. సర్వేలో పాల్గొన్న యువతలో పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం గుర్తించారు. అనాబాలిక్ స్టెరాయిడ్ వాడకంతో సంబంధం వున్న సమస్యల గురించి ప్రజలు తెలుసుకున్నప్పటికీ , జిమ్ ప్రోటీన్ సప్లిమెంటేషన్ ప్రతికూల ప్రభావాలను చూపుతుందని కొద్దిమందికి మాత్రమే అవగాహన వున్నట్లు గుర్తించారు. బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జాక్సన్ కిర్క్‌మాన్ బ్రౌన్ మాట్లాడుతూ.. పురుషులు ప్రాంప్ట్ చేసినప్పుడు వారి సంతానోత్పత్తి గురించి ఆసక్తిగానే వుంటారని కనుగొన్నట్లు చెప్పారు. కానీ సంతానోత్పత్తి అనేది స్త్రీలు ఎదుర్కొనే సమస్య అని సమాజంలో ఎక్కువగా వినిపించే మాట. ఎందుకంటే పురుషుల సంతానోత్పత్తి వారి జీవితకాలం మొత్తం ఒకేలా వుంటుందని ఎక్కువమంది నమ్ముతారు. 

ప్రజలు ఆరోగ్యంగా ఉండకపోవడానికి , వ్యాయామం చేయకపోవడం ఒక కారణం . కానీ ప్రజలు ప్రోటీన్, విటమిన్లు లేదా మరేదైనా సరే వారు తీసుకునే ఏ విధమైన సప్లిమెంట్ల గురించి అవగాహన కలిగివుండాలి. ప్రోటీన్ కంటే సహజ ఆహార వనరులను ఉపయోగించడం మంచిదని ఈ అధ్యయనం తెలిపింది. ఎందుకంటే ఇవి ఏదైనా పర్యావరణ కాలుష్య కారకాలతో అధిక స్థాయిలో కలుషితమయ్యే అవకాశం తక్కువ. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios