Asianet News TeluguAsianet News Telugu

ఉదయాన్నే నిమ్మరసం తాగితే.. ఎన్ని ప్రయోజనాలో...!

కొన్నిసార్లు పొరపాటున కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే.. నిమ్మరసం తాగిస్తే వారికి ఉపశమనం కలిగిస్తుంది. 

Not Just Weight Loss, Lemon Juice May Help Manage Kidney Stones Too
Author
Hyderabad, First Published Feb 4, 2021, 2:24 PM IST

ఉదయం లేవగానే.. మంచినీరు తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అయితే... సాధారణ నీటికి బదులు.. నిమ్మరసం తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది కేవలం బరవు తగ్గడానికి మాత్రమే.. ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగుతారు. అయితే.. అంతకు మించిన ప్రయెజనాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

నిమ్మకాయ నీరు  యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల వయసు పెరుగుతున్నా చర్మాన్ని త్వరగా ముడతలు పడనీయదు. నిమ్మలో దొరికినంత సి విటమిన్ పండ్లలోనూ లభించదు.

పంటినొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నియంత్రిస్తుంది. కొన్నిసార్లు పొరపాటున కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే.. నిమ్మరసం తాగిస్తే వారికి ఉపశమనం కలిగిస్తుంది. 

బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. 
కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కారణంగానే నిమ్మరసం తాగాలని వైద్యులు తరచుగా సూచిస్తుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios