ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లిపోతోంది. వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు రాత్రనకపగలనక శ్రమిస్తున్నారు. కరోనా మహమ్మారి ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా.. మళ్లీ సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో.. దీనిని ఎలా అరికట్టాలో జనాలకు అర్థం కావడం లేదు. కాగా.. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడంలో భాగంగా నిపుణులు ఓ పరిష్కారం కనుగొన్నారు. సాధారణంగా మనం నోరు దుర్వాసన రాకుండా ఉండేందుకు మౌత్ వాష్ వాడుతూ ఉంటాం. అయితే.. ఆ మౌత్ వాష్ తో  కేవలం 30 సెకన్లలో కరోనాని చంపేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

జెర్మనికి చెందిన నిపుణులు డెంటల్ ట్రీట్మెంట్ కు ఉపయోగపడే ప్రోడక్ట్ వల్ల సార్స్ కోవిడ్-19  వైరస్ కారణం అయ్యే సార్స్ కోవ్-2 ను డియాక్టివేట్ చేస్తుందట. వైరల్ లోడ్ ను తగ్గించడానికి మౌత్ వాష్  చేస్తే సరిపోతుందట. ఇలా చేయడం వల్ల గొంతులో ఉన్న వైరస్ అంతం అవుతుంది అని.. దాంతో వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది అంటున్నారు.

మౌత్ వాష్  ప్రోడక్ట్ లో ఉన్న వివిధ ఇంగ్రీడింట్స్ వల్ల సానుకూల ప్రభావం ఉంటుంది అంటున్నారు. పరిశోధకులు ల్యాబ్ లో వివిధ వైరస్ లతో మౌత్ వాష్ లను ప్రయోగించగా..ఫలితం కనిపించింది అన్నారు. మౌత్ వాష్ మిక్స్ ను దాదాపు 30 సెకన్ల పాటు షేక్ చేసి తరువాత పుక్కిలించారట.

జర్మనీలో ప్రచురితం అయిన జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ లో వెల్లడి అయిన సమాచారం ప్రకారం వైరస్ శాతాన్ని ఈ మౌత్ వాష్ విజయవంతంగా తగ్గించిందట. అది కూడా కేవలం 30 సెకన్ల పాటు మాత్రమే. అయితే దీని ఖచ్చితత్వంపై ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నాం అని.. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని పరిశోధకులు తెలిపారు.