ఉదయం లేవగానే మనలో చాలా మంది చేసే మొదటి పని. వేడి వేడిగా కాఫీ కానీ... టీ కానీ తాగడం. అవి తాగకుండా చాలా మందికి అసలు రోజు మొదలవ్వదు. అయితే.. వాటకి బదులు పరగడుపున ఆరోగ్యకరమైన కొన్ని రకాల జ్యూస్ లు తాగడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

రాత్రి భోజనం చేసి.. మళ్లీ ఉదయం ఏదైనా ఆహారం తీసుకోవడానికి మధ్య దాదాపు 12గంటల సమయం ఉంటుంది. ఆ సమయమంతా పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో మన పొట్ట స్పాంజీలాగా ఉంటుంది. మొదట పరగడుపున మనం ఏ ఆహారం తీసుకుంటే.. పొట్ట దానిని పీల్చుకుంటుంది. వాటర్ లో వేయగానే.. స్పాంజి ఏవిధంగా నీటిని పీల్చుకుంటుందో.. ఆహారం కూడా అలానే అనమాట. కాబట్టి.. పరగడుపున తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరమైనదై ఉండాలి.

అందుకే.. పాలు, టీ, కాఫీ లాంటివి కాకుండా.. కొన్ని రకాల జ్యూసులు పరగడుపున తాగడం వల్ల ఆరోగ్యంతోపాటు.. స్కిన్ చాలా మృదువుగా అందంగా తయారౌతుందని.. తద్వారా యవ్వనంగా కనపడతారని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జ్యూసులేంటో ఓసారి చూసేద్దామా..

1. గోధుమ గడ్డి జ్యూస్ లేదా ఆర్గానిక్ గోధుమ గడ్డి పౌడర్ తో తయారు చేసిన జ్యూస్

2. లెమన్ వాటర్.

3.గోరువెచ్చని నిమ్మకాయ నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి తీసుకోవాలి.

4.నిమ్మకాయ, అల్లం, దాల్చిన చెక్క, పసుపు, మిరియాలు, నీరు, తేనె కలిసి జ్యూస్ లాగా చేసుకోని తాగాలి.

5.ఒక స్పూన్ యాపిల్ సిలిండర్ వెనిగర్ లో నిమ్మకాయ, అల్లం, వెల్లుల్లి, తేనె కలిపి తీసుకోవాలి.

6.గోరు వెచ్చని నీటిలో తులసి ఆకుల రసం కలిపి తీసుకోవాలి.

7.నీటిలో తులసి ఆకులు, అల్లం, నిమ్మకాయ, తేనె కలిపి తీసుకోవాలి.