Acidity: ఆయిలీ ఫుడ్స్, మసాలా, నూనె ఎక్కువగా ఉండే  ఆహారాలను తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలను ఫేస్ చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ సమస్యలతో బాధపడేవారు కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదెలాగంటే? 

 Acidity: ఈ రోజుల్లో ఎసిడిటీతో బాధపడేవారు ఎక్కువయ్యారు. అయినా ఇది నేడు సర్వ సాధారణ అనారోగ్య సమస్యగా మారిపోయింది. ఎసిడిటీ ఇతర రోగాల్లాంటి లక్షణాలను కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే గుండెల్లో మంట, కడుపులో మంట కలగడం ఎసిడిటీ ప్రధాన లక్షణాలు. కొంతమంది ఎసిడిటీ వల్ల కలిగిన నొప్పిని గుండె నొప్పిగా కూడా భావిస్తుంటారు. ఇంకొంతమందికి ఎసిడిటీ వల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది. దీనికి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే అల్సర్లు, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. 

పనిలో పడి సమయానికి తినకపోవడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆహారంలో మార్పులు, డిఫరెంట్ కాంబినేషన్ ఫుడ్ ను తినడం, ఎక్స్ పైరీ అయిపోయిన ఆహారాలను, కలుషితమైన ఆహారాలను తినడం, కలుషితమైన చేపల మాంసాలు, స్పైసీ, పుల్లని ఆహారాలు, మానసిక ఒత్తిడి వంటివన్నీ ఎసిడిటీకి దారితీస్తాయి. ఎసిడిటీని నివారించడానికి మీరు చేయాల్సిన మొదటి పని ప్రతిరోజూ సమయానికి తినడం. అలాగే మీరు తినే భోజనాల మధ్య గ్యాప్ మరీ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అంతేకాదు ఎక్కువ కూడా తినకూడదు. మధ్యమధ్యలో హెల్తీ ఆహారాలను తింటూ ఉండాలి. 

అసిడిటీని నివారించడానికి మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు 

  • కెఫిన్ కూడా ఎసిడిటీని కలిగిస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు కెఫిన్ కంటెంట్ ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది. 
  • వేయించిన, నూనెలో వేయించిన ఆహారాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా ఎసిడిటీని కలిగిస్తాయి. అందుకే ఇలాంటి ఆహారాలను చాలా తక్కువ తీసుకోవాలి. 
  • ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు నిమ్మకాయలు, నారింజ వంటి యాసిడ్ ఎక్కువగా ఉండే పంట్లను తినకూడదు. 
  • బీన్స్, బంగాళాదుంపలు కూడా ఎసిడిటీని కలిగిస్తాయి. వీటితో పాటుగా అసిడిటీని పెంచే ఇతర ఆహార పదార్థాలను తినకూడదు. 
  • ఎసిడిటీకి దూరంగా ఉండాలంటే మీరు పడుకోవడానికి రెండు గంటల ముందే తినాలి. 
  • ఆహారాన్ని నమలకుండా మింగకూడదు. ఇది మీ జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. దీంతో ఎసిడిటీ ఏర్పడుతుంది. అందుకే ఏవి తిన్నా బాగా నమిలి తినండి. అప్పుడే ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావు.
  • ఊరగాయలను ఇష్టంగా తినేవారున్నారు. కానీ వీటిని ఎక్కువగా తింటే ఎసిడిటీ సమస్య వస్తుంది. అందుకే వీలైనంత వరకు ఊరగాయలకు దూరంగా ఉండండి. 
  • లవంగాలు ఎసిడిటీని నివారించడానికి బాగా సహాయపడతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత లవంగాలను నోట్లో వేసుకోండి. 
  • జీర్ణక్రియ మెరుగ్గా పనిచేసేందుకు భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలను తినండి. 
  • ఎసిడిటీని నివారించడానికి మరొక గొప్ప మార్గం నీటిని ఎక్కువగా తాగాలి. నీళ్లు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.