Asianet News TeluguAsianet News Telugu

మీ ఒంట్లో కొలెస్ట్రాల్ ఉందా? అయితే వీటిని పొరపాటున కూడా తినకండి

మీ రక్తంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటే.. అది కొల్వలుగా మారుతాయి. ఇవి గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
 

 High Cholesterol: these foods should be avoid high cholesterol people
Author
First Published Apr 1, 2023, 12:46 PM IST


కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని అన్ని కణాలలో కనిపించే మైనపు పదార్థం. ఇది హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, విటమిన్ డి ని ఉత్పత్తి చేయడానికి, జీవక్రియను పెంచడానికి చాలా అవసరం. మంచి కొలెస్ట్రాల్ లేదా అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (హెచ్డిఎల్) ఆరోగ్యకరమైన కణజాలాలను నిర్మించడానికి, నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. రక్తంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (ఎల్డిఎల్) ఎక్కువ స్థాయిలో ఉంటే.. అది కొవ్వు నిల్వలుగా రూపాంతరం చెందుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలను అసలే తినకూడదు. ఎందుకంటే ఇవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. 

వెన్న

వెన్నలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇది లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ప్రాసెస్ చేసిన వెన్నను తినడం మానుకోండి. ఎందుకంటే ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

ఐస్ క్రీమ్

కొలెస్ట్రాల్ ఉన్నవారు ఐస్ క్రీం ను అసలే తినకూడదు. ఎందుకంటే వీటిని తక్కువ-నాణ్యత ఉన్న హైడ్రోజన్ కూరగాయల నూనెలను ఉపయోగించి తయారుచేస్తారు. ఐస్ క్రీం కు కొవ్వు పాలు, క్రీమ్ ను కూడా ఉపయోగిస్తారు. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

కొబ్బరి నూనె

కొబ్బరినూనె మన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనలో చాలా మంది అనుకుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

రెడ్ మీట్

శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారు రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. ఎర్ర మాంసంలో సంతృప్త జంతువుల కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను  బాగా పెంచుతుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్ లో హైడ్రోజన్ కూరగాయల నూనెలు ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాక బంగాళాదుంపలు, చికెన్ వింగ్స్ , మొజారెల్లా స్టిక్స్ తో తయారు చేసిన స్నాక్స్ ఒంట్లో  కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios