దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయడుతుంది. పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి దానిమ్మ అద్బుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ పండు రుచి అద్బుతంగా ఉంటుంది. కానీ ఈ పండును తినేవారు చాలా తక్కువే. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మను రోజూ తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది. పెరుగుతున్న హృదయ సంబంధ వ్యాధులను నివారించడానికి దానిమ్మ అద్భుతమైన ఔషధమని నిపుణులు అంటున్నారు.

2019 లో 17.9 మిలియన్ల మంది హృదయ సంబంధ సమస్యలతో బాధపడ్డారని ఓ సర్వే అంచనా వేసింది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా గుండె పోటు, గుండెజబ్బుల బారిన పడుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గుండెను జాగ్రత్తగా చూసుకోవాలి. ధమనులను సంరక్షించడానికి, గుండె ఆరోగ్యంగా ఉండటానికి రోజూ మూడు దానిమ్మ పండ్లను తినాలని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ అంటున్నారు.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే రోజుకు మూడు దానిమ్మ పండ్లు తినండి' అని అంజలి ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. దానిమ్మ శక్తివంతమైన యాంటీ అథెరోజెనిక్ ఏజెంట్. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ధమనులను శుద్ధి చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. గుండెను రక్షిస్తాయి. రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు రోజుకు మూడు దానిమ్మ పండ్లను కనీసం మూడు నెలల పాటు తీసుకోవాలి. 

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ల భాండాగారం. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడానికి, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఎంతో సహాయపడుతుంది.

దానిమ్మ రసం పొటాషియానికి మంచి మూలం. ఇది ఆరోగ్యకరమైన కండరాల పనితీరుకు, హృదయ స్పందన రేటు నియంత్రణకు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్. ఇందులో టానిన్లు, ఆంథోసైనిన్స్ కూడా ఉంటాయి. ఇవి యాంటీ అథెరోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. తక్కువ-సాంద్రత లిపోప్రొటీన్ లేదా ఎల్డిఎల్, చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నెమ్మదింపజేస్తుంది. దానిమ్మలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పలు పరిశోధనల ప్రకారం.. దానిమ్మ టైప్ 2 డయాబెటిస్ నివారణకు, నియంత్రణకు సహాయపడతాయి.