కొంతమందికి తిన్న వెంటనే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను ఫేస్ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఫుడ్ కాంబినేషనే అంటున్నారు నిపుణులు.  

ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ను తినడం వల్ల జీర్ణక్రియ బాగా దెబ్బతింటుంది. దీనికితోడు మన ఆహారపు అలవాట్లతో కూడా జీర్ణక్రియ ఆరోగ్యం మరింత దిగజారుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఈ రోజుల్లో చిన్న వయసు వారు కూడా గ్యాస్, ఎసిడిటీ , ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం తప్పుడు ఆహారపు అలవాట్లేనంటున్నారు నిపుణులు. జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తూ ఉబ్బరం, ఎసిడిటీ, కడుపు నొప్పికి కారణమయ్యే ఆహార కలయికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పండ్లు, పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో జంతు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి వాటిలో పండ్లను కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, ఇతర ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. సాధారణంగా చాలా మంది ఫ్రూట్ సలాడ్లలో పెరుగును ఉపయోగిస్తారు. అలాగే పండ్ల స్మూతీలు, బ్రేక్ ఫాస్ట్ లో పాలలో పండ్లను వేసుకుని తాగుతుంటారు. ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండేనే కడుపు ఉబ్బరం వచ్చే సమస్య తగ్గుతుంది. 

మాంసాలు, పిండి పదార్థాలు

జంతు ప్రోటీన్, కార్బ్ కాంబినేషన్ మీ జీర్ణవ్యవస్థకు అస్సలు మంచిది కాదు. జంతు ప్రోటీన్, కార్బ్ ను జీర్ణం చేయడానికి రెండు వేర్వేరు ఎంజైమ్లు అవసరమవుతాయి. కాబట్టి ఈ రెండు ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల అజీర్థి, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఇలాంటి ఫుడ్ కాంబినేషన్ కు దూరంగా ఉండండి. 

ఆహారం, పానీయాలు

వాటర్, టీ, కాఫీ, శీతల పానీయాలు వంటి ఏదైనా పానీయాలను తిన్నవెంటనే తాగడం మంచిది కాదు. దీనివల్ల మీ జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ ఎంజైమ్లు పలుచబడతాయి. ఇది మీ జీర్ణ ప్రక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఎసిడిటీ, అజీర్థి, ఉబ్బరం వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అందుకే ఇలాంటి సమస్యలను దూరంగా ఉండటానికి భోజనానికి ముందు తర్వాత కనీసం 30 నిమిషాల బ్రేక్ ఇవ్వండి. 

పుచ్చకాయలు, ఇతర పండ్లు

ఇతర పండ్లతో పోలిస్తే పుచ్చకాయలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ పండును వేరే పండ్లతో కలిపి తీసుకుంటే ఎసిడిటీ, అజీర్థి, ఉబ్బరం సమస్యలు వస్తాయి. కాబట్టి పుచ్చకాయలను ఏ ఆహార పదార్థంతోనూ తినకండి. ఫ్రూట్ సలాడ్లలో కూడా వీటిని ఉపయోగించకూడదు. పుచ్చకాయలను తిన్న తర్వాత వేరే పండ్లను తినాలంటే కనీసం 30 లేదా 50 నిమిషాల పాటు ఆగాలి. 

పండ్లు, పిండి పదార్థాలు

కార్బ్ ఎక్కువగా ఉండే ఆహారాలతో పోలిస్తే పండ్లు చాలా త్వరగా, సులభంగా జీర్ణమవుతాయి. కాగా కార్భ్ ను పిండి పదార్థాలను కలిపి తీసుకుంటే జీర్ణ ప్రక్రియలో తేడా జరుగుతుంది. దీనివల్ల ఎసిడిటీ, అజీర్ణం, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే పండ్లను తిన్న తర్వాత కనీసం 40 నిమిషాలు పాటే మరేదీ తినకూడదు.