పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిని తినడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. పెరుగులో కాల్షియంతో పాటుగా విటమిన్ బి6, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగును తింటే శరీర రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగని దీన్ని ఎక్కువగా తింటే ఎన్నో సమస్యలు వస్తాయి తెలుసా?
పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషదగుణాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో విటమిన్ బి2, విటమిన్ బి6, విటమిన్ బి12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. రోజుకు ఒక కప్పు పెరుగును తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉండదు. అలాగే ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పెరుగు మన ఆరోగ్యానికి మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. అలాగని మూడు పూటలా అంటే మోతాదుకు మించి పెరుగును తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయి.
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండే వారు పెరుగును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయని వారు పెరుగును తింటే మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. రోజుకు ఒక కప్పు పెరుగును తింటే ఎలాంటి సమస్యలు రావు. కానీ ఇంతకు మించి తింటేనే ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే..
అపానవాయువు (పిత్తులు)
పెరుగులో లాక్టోజ్ ఉంటుంది. అయితే వయసు పెరుగుతున్నా కొద్దీ మన శరీరంలో లాక్టోజ్ ఎంజైమ్ తగ్గుతుంది. లాక్టోస్ ఎంజైమ్ తక్కువగా ఉన్నవారు పెరుగును తింటే ఎన్నో సమస్యలు వస్తాయి. లాక్టోస్ అనేది పాలలోని చక్కెర. ఇది మన శరీరంలోని లాక్టోజ్ ఎంజైమ్ సహాయంతో జీర్ణమవుతుంది. మన శరీరంలో లాక్టోజ్ ఎంజైమ్ లేనప్పుడు.. పెరుగు నుంచి వచ్చే లాక్టోజ్ అంత సులువుగా జీర్ణం కాదు. అంతేకాదు ఇది శరీరంలో మంటను కలిగిస్తుంది. అలాగే అపానవాయువుకు దారితీస్తుంది.
బరువు పెరుగుతారు
పెరుగులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తింటే మీరు సులువుగా బరువు పెరుగుతారు. అందుకే బయట పెరుగును కొంటే దానిలో కొవ్వు పరిమాణం ఎంత ఉందో చెక్ చేయండడి. కేలరీల పెరుగుకు బదులుగా ప్రోటీన్ పెరుగును తినండి.
మోకాళ్ల నొప్పి
పాల ఉత్పత్తుల్లో ముఖ్యంగా పెరుగులో ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎముకల సాంద్రత తగ్గడం మొదలవుతుంది. దీంతో మోకాళ్ల నొప్పులు వస్తాయి. అందుకే ఆర్థరైటిప్ పేషెంట్లు పెరుగును ఎక్కువగా తినకడదు. ఇది మోకాళ్ల నొప్పిని మరింత పెంచుతుంది.
ఆయుర్వేదం ప్రకారం..
చలికాలంలో పెరుగును తినకూడదు. ఎందుకంటే పెరుగు చల్లగా ఉంటుంది. దీనిని తినడం వల్ల దగ్గు, జలువు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. పెరుగు కఫ లోపాలను పెంచుతుంది. ఇది ఉబ్బసం, సైనస్ , జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు శరీరంలో మంటను కలిగిస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెరుగును తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం. పెరుగులో ఏవేవో కలిపి తినకుండా సాదా పెరుగును తినడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
