ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎండాకాలంలో మాంసాన్ని ఎక్కువగా తినకూడదు. బదులుగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. 

దేశంలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలాంటి సమయంలో మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవాలి. ఎన్నో జాగ్రత్తలను కూడా పాటించాలి. ఎండలు రోజు రోజుకు ముదురుతున్నాయి. అందుకే మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకూడదు. అలాగే నీటిని పుష్కలంగా తాగాలి. ముఖ్యంగా ఈ సీజన్ కొన్ని ఆహారాలను చాలా వరకు తగ్గించాలి. ఇంకొన్ని ఆహారాలను పుష్కలంగా తీసుకోవాలి.

వేసవిలో మాంసాహారాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో మాంసాహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ సీజన్ లో మాంసాన్ని తక్కువగా తినాలంటరు. ఈ సీజన్ లో మాంసాహారాన్ని తగ్గించడంతో పాటుగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇది నిర్జలీకరణాన్ని నివారించడానికి కూడా సహాయపడతాయి. నీళ్లతో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే పానీయాలను కూడా తీసుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ సీజన్ లో ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నిమ్మకాయ నీరు

ఈ సీజన్ లో తప్పకుండా తాగాల్సిన పానీయాలలో నిమ్మకాయ నీరు ఒకటి. లెమన్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్-సీ లు పుష్కలంగా ఉంటాయి. వడదెబ్బకొట్టడాన్ని నివారించడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

మజ్జిగ

మజ్జిగ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని కూడా ఎండాకాలంలో ఎక్కువగా తాగుతారు. మజ్జిగ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. హెల్తీ గా ఉంచుతుంది.

కుంకుమ పువ్వు

ఎండాకాలంలో కుంకుమపువ్వు జ్యూస్ ను తాగితే కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఈ పానీయం నిర్జలీకరణాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అయితే దీనిలో కొన్ని పుదీనా ఆకులను వేసి వేసి తాగినా ఈ సీజన్ లో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. 

కొబ్బరి నీరు

కాలాలతో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లను తాగాలిని డాక్టర్లు చెప్తుంటారు. ముఖ్యంగా ఎండకాలంలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగాలి. ఎందుకంటే ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచుతాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. దీనిలో ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. ఈ నీళ్లు బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అద్బుతంగా పనిచేస్తాయి. 

సీజనల్ కూరగాయల రసం

సీజనల్ గా దొరికే రకరకాల కూరగాయల రసం సమ్మర్ డ్రింక్స్ గా కూడా ఉపయోగపడతాయి. నిజానికి ఇవి ఎంతో హెల్తీవి. కాకపోతే వీటిని ఇంట్లోనే తయారుచేసి తీసుకోవడానికి ప్రయత్నించండి.