సాధారణంగా కాలంతో సంబంధం లేకుండా మనకు మార్కెట్లో అన్నివేళలా అందుబాటులో ఉండే పండ్లలో అరటిపండు ఒకటి. ఇలా అరటిపండు ఎన్నో పోషక విలువలతో కూడుకొని ఉండటం వల్ల అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రతిరోజు ఒక అరటిపండు తినటం వల్ల శరీరానికి కావాల్సిన స్థాయిలో పోషకాలు అందుతాయని మనకు తెలిసిందే.అయితే ఇప్పటివరకు మనం కేవలం పసుపు రంగులో ఉండే అరటి పండ్లను మాత్రమే చూసాం కానీ ఈ అరటి పండులో ఉన్నటువంటి పోషక విలువలు కన్నా ఎరుపు రంగు అరటిపండులో మరెన్నో పోషక విలువలు ఉంటాయి. 

ఎర్ర అరటి పండులో కేలరీలు తక్కువగాను పిండి పదార్థాలు అధికంగానూ ఉంటాయి. అధిక మొత్తంలో విటమిన్ b6, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.ఇందులో ఉన్నటువంటి పొటాషియం శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటును నియంత్రిస్తుంది తద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

ఎర్రని అరటి పండులో లుటిన్ మరియు బీటా కెరోటిన్ అనే రెండు కేరోటినాయుడ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఇక ఎర్రని అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ ను బయటకు తొలగించి మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శరీరంలో అధిక ఫ్రీ రాడికల్స్ ఆక్సికరణ ఒత్తిడికి గురికావడంతో గుండెపోటు, మధుమేహం క్యాన్సర్ వంటి సమస్యలు తలతే అవకాశాలు ఉంటాయి కనుక శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్ ని తొలగించి ఈ వ్యాధులను నిరోధిస్తుంది.

ఇక ఇందులో ఉన్నటువంటి విటమిన్ b6 విటమిన్ సి రోకనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదపడతాయి. ఎర్రని అరటి పండ్లలో ఫైబర్, ఫ్రీ బయోటిక్స్ ఎంతో పుష్కలంగా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదపడతాయి. అలాగే ప్రేగు కదలికలకు, ప్రేగులలో ఏర్పడే మంటను కూడా తగ్గించడానికి దోహద పడతాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల శరీర బరువు తగ్గించడానికి దోహదం చేస్తాయి.ఈ అరటిపండును తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది కనుక శరీర బరువు తగ్గడానికి ఎర్ర అరటి పండ్లు దోహదపడతాయి.