దానిమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో, మధ్యాహ్నం భోజనంలో తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ గింజలు మీ బరువును కూడా తగ్గిస్తాయి తెలుసా?  


దానిమ్మ అందరికీ ఇష్టమయ్యే హెల్తీ పండు. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ గింజలను ఎక్కువగా ఎన్నో వంటలను గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఫుడ్ ను అందంగా మార్చడమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అవును ఈ పండును తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు సక్రమంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే ఈ పండును ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 

దానిమ్మ ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లకు అద్భుతమైన మూలం. దీనిని ఏ రూపంగా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఈ పండులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, సహజ చక్కెర, ఫైబర్, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ సి, ఫోలేట్ లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యానికి చాలా అవసరం. వీటితో పాటుగా దానిమ్మలో పాలీఫెనాలిక్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటే? 

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి

దానిమ్మ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉంటాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక పరిశోధనలో.. రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తి 2 మి.లీ దానిమ్మ రసం 150 వారాల పాటు క్రమం తప్పకుండా తాగాలి. 2 వారాల తర్వాత అతని రక్తపోటు పూర్తిగా నార్మల్ గా ఉన్నట్టు కనుగొన్నారు. 

జీర్ణ సమస్యలు తగ్గుతాయి

దానిమ్మ గురించి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. దానిమ్మ పండును తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. దానిమ్మలో ఉండే ఫైబర్, ప్రోబయోటిక్ సమ్మేళనాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు రావు. అలాగే మలబద్ధకం, ప్రేగు క్యాన్సర్, గ్యాస్, ఎసిడిటీ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

మూత్రానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి

దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి యుటిఐ, మూత్రాశయ సంక్రమణను కూడా తగ్గిస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. దానిమ్మను పండును తింటే రక్తంలో ఆక్సలేట్ కాల్షియం, భాస్వరం నియంత్రణలో ఉంటాయి.

బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది

పబ్ చేసిన అధ్యయనం ప్రకారం.. దానిమ్మ అంటువ్యాధులు, అలెర్జీలకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. దీనిలో ఉండే మొక్కల సమ్మేళనాలు ఎన్నో రకాల ప్రమాదకరమైన సూక్ష్మజీవుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. నోటి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

మెదడు పనితీరును పెంచుతుంది

దానిమ్మలో ఉండే సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి మన శరీరంలో మంట పెరగకుండా చేస్తాయి. ఇది మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడానికి కూడా ఈ పండు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. దానిమ్మలో ఉన్న పాలీఫెనోలిక్ సమ్మేళనాలు, కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నార్మల్ గా ఉంచుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కారకాలు చాలా అవసరం.