కొత్త కొత్త పానీయాలు ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం విదేశీ పానీయం మాచా టీ కూడా బలే ట్రెండ్ అవుతోంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
ఇప్పుడు సిటీల్లో కొత్త రకం టీ బలే ట్రెండ్ అవుతోంది. అదే మాచా టీ. అవును ఈ మధ్యకాలంలో మాచా టీ గురించే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మాచా టీని పొడి ఆకులతో తయారుచేస్తారు. ఈ గ్రీన్ టీ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని నిపుణులు చెబుతున్నారు. కామెలియా సిసెన్సిస్ అని పిలువబడే మొక్కల ఆకులతోనే ఈ టీని తయారుచేస్తారు. ఈ పంటను రెజిమెంటల్ ప్రక్రియతో పెంచుతారు. ఈ గ్రీన్ టీ రుచి అద్బుతంగా ఉంటుంది. అసలు ఈ టీని తాగితే ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి
యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. మాచా, గ్రీన్ టీల్లో సాధారణంగా కాటెచిన్స్ తో సహా యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ టీలో ఫ్లేవనాయిడ్లు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలను కలిగున్న సమ్మేళనాలు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయని ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్లో ఒక అధ్యయనం పేర్కొంది. టీ లో ఉండే ఫ్లేవనాయిడ్లు మంటను తగ్గిస్తాయి. ఇవి యాంటీ మైక్రోబయల్ ప్రభావాలను కలిగుంటాయి. ఇవి దంత క్షయాన్ని కూడా నివారిస్తాయి.
క్యాన్సర్ ను నిరోధించొచ్చు
అనేక పరిశోధనలు మాచా క్యాన్సర్ నిరోధక లక్షణాల సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడించాయి. ఏదేమైనా క్యాన్సర్ ను నివారించడానికి మాచా టీ ఖచ్చితంగా సహాయపడుతుందని వెల్లడించిన నిర్దిష్ట పరిశోధనలు లేవు.
మెరుగైన మెదడు పనితీరు
మాచా టీ మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుగున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని అధ్యయనాలు మాచా టీని తాగితే జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటుగా ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
బరువు తగ్గడం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ పరిశోధన ప్రకారం.. గ్రీన్ టీ శక్తి వ్యయం, కొవ్వు ఆక్సీకరణను పెంచుతుంది. లిపోజెనిసిస్, కొవ్వు శోషణను తగ్గిస్తుంది. శరీర బరువుపై ఇది సాధారణ ప్రభావాన్ని చూపుతుంది. దీనిలలో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మెరిసే చర్మం
మాచాలో మంచి మొత్తంలో కాటెచిన్స్ ఉంటాయి. ఇది కొల్లాజెన్ స్థాయిని మెరుగుపరిచే సమ్మేళనం. ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ స్టడీ ప్రకారం.. చర్మ పునరుత్పత్తి, గాయాల నయం లేదా అల్సర్లు, సోరియాసిస్, రోసేసియా, ఆక్టినిక్ కెరాటోసిస్ వంటి కొన్నిసమస్యలను తగ్గించడానికి గ్రీన్ టీ సహాయపడుతుంది. ఈ టీ లో వాడే మాచా పౌడర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎనర్జీని పెంచుతుంది
దీనిలో కూడా కెఫిన్, ఎపిగల్లోకాటెచిన్ గాలేట్ (ఇజిసిజి) అని పిలిచే శక్తివంతమైన పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇలాంటి మాచా టీని తాగితే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.
