ప్రస్తుత కాలంలో మారిన ఆహార పదార్థాలు వాతావరణ కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి సమస్యలలో జుట్టు సమస్య ఒకటి. ఎంతోమంది జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎంతోమంది అధిక జుట్టు రాలే సమస్యతో సతమతమవుతున్నారు. ఇలా జుట్టు సమస్యలకు ఎన్నో పరిష్కారం మార్గాలను ఉపయోగిస్తూ ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం మాత్రం ఉండదు.
ఈ క్రమంలోనే మెంతికూరతో జుట్టు సమస్యలకు, చుండ్రు సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. మరి ఏ విధంగా ఈ జుట్టు సమస్యలకు మెంతికూర ప్రయోజనకరంగా మారుతుంది. ఎలా దీనిని అప్లై చేయాలి అనే విషయానికి వస్తే... ఒక కప్పు మెంతి ఆకులను తీసుకొని మిక్సీలో వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేయాలి. ఇలా మిశ్రమంల తయారు చేసుకున్న ఈ గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని తల మాడు నుంచి జుట్టు కొనల వరకు రాయాలి. ఇలా జుట్టు మొత్తం ఈ మిశ్రమాన్ని రాసిన తర్వాత ఒక అరగంట పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ఎక్కువ రసాయనాలు లేనటువంటి షాంపూతో తలంటు స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల ఏర్పడినటువంటి చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా, జుట్టు రాలిపోవడం జుట్టు నీరసించి పోవడం వంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి.
ఇలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ పద్ధతిలోనే జుట్టు సమస్యలను పూర్తిగా నివారించవచ్చు. ఇక మార్కెట్లో కూడా వివిధ రకాల షాంపులు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని రకాల షాంపులను ఉపయోగించడం వల్ల చుండ్రు తొలగిపోవడమే కాకుండా ఇతర సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఇలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ పద్ధతిలో మెంతికూర ద్వారా చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు అలాగే అందమైన, ఒత్తయిన జుట్టును కూడా మీ సొంతం చేసుకోవచ్చు.
