ఈ సమస్యలున్న వారికి అల్లం ఓ వరం..!

అల్లం మంచి పోషకాల నిధి. దీనిలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. అల్లాన్ని ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
 

 ginger health benefits rsl

అల్లం లేని వంటిల్లు అసలే ఉండదేమో. అల్లాన్ని ప్రతి కూరలో వేస్తుంటారు. అల్లం వంటలను టేస్టీగా చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. కానీ అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. దీన్ని వంట్లోనే కాదు.. పచ్చిగా తినొచ్చు. అలాగే అల్లం రసాన్ని తాగొచ్చు. అల్లాన్ని రెగ్యులర్ టీ లో లేదా హెర్బల్ టీతో కలిపి తీసుకోవచ్చు. అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో ఉండే 'జింజెరోల్' ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అల్లంలో విటమిన్ బి 3, విటమిన్ బి 6, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. అసలు అల్లాన్ని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

అల్లంలో ఉండే ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అల్లం కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం, గ్యాస్ట్రిక్, అజీర్థి వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. అల్లంలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని మన రెగ్యులర్ ఫుడ్ లో చేర్చుకుంటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వ్యాధులతో మన శరీరం పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది, అల్జీమర్స్ వ్యాధి నుంచి రక్షిస్తుంది

అల్లంలో ఉండే ఔషదగ గుణాలు మన ఒత్తిడిని ఇట్టే తగ్గించేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని తీసుకుంటే మన మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్స్ వంటి మానసిక వ్యాధులను దూరం చేస్తాయి. 

బరువు తగ్గడం

మీకు తెలుసా? అల్లం మన బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. అల్లం శరీర వేడిని పెంచుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు తొందరగా తగ్గిపోతాయి. 

డయాబెటిస్ మెల్లిటస్ , ఆర్థరైటిస్ రోగులకు మంచిది

అల్లం ఎన్నో రోగాలను నియంత్రణలో ఉంచుతుంది. అల్లాన్ని తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ రోగులకు మంచి మేలు చేస్తాయి. అల్లం కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

రక్తపోటును నియంత్రిస్తుంది,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందంగా మెరిసేలా చేస్తాయి. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios