Asianet News TeluguAsianet News Telugu

గొంతు నొప్పా..? అంజీరా ట్రై చేయండి..!

ఈ పండ్లలో ఉండే పెప్టిన్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్ బి6 అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రోజు రెండు లేదా మూడు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది.

From boosting heart health to controlling weight: Enjoy the many benefits of fig or anjeer
Author
Hyderabad, First Published Nov 20, 2020, 3:00 PM IST

డ్రై ఫ్రూట్స్ లో అంజీరా పండుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ అంజీరా పండ్లనే సీమ మేడి పండు అని కూడా పిలుస్తారు. ఈ పండు రూపంలోనే కాదు.. ఎండు రూపాల్లో కూడా లభిస్తుంది. దీనిని ఎలా తిన్నా.. ఇనుము, మెగ్నేషియం, పొటాషియం, కాల్షియం వంటి  ఖనిజాలు, విటమిన్ బి6 అధికంగా శరీరానికి అందుతాయి. వీటితోపాటు దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూస్తే..

అధికరక్తస్రావంతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషదం లా పనిచేస్తుంది. దీనిని ఉసిరిపొడితో కలిపి తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుంది. అంజీరా ఆకులను నీళ్లలో కాచిచల్లార్చి తాగితే పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.

ఈ పండ్లలో ఉండే పెప్టిన్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్ బి6 అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రోజు రెండు లేదా మూడు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. అలా అని అతిగా తింటే.. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.

అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవాళ్లు, రక్తప్రసరణ వ్యవస్థలో తేడా ఉన్నవాళ్లు కూడా అంజీరాను తీసుకుంటే చాలా మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios