Asianet News TeluguAsianet News Telugu

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే... ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..!

కొన్ని ఆరోగ్య మార్పులతో.. దీనిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందట. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల మనం లివర్ ఫెయిల్యూర్ ని కంట్రోల్ చేయవచ్చట. మరి అవేంటో ఓసారి చూద్దాం..
 

Foods you MUST avoid to save the liver from further damage
Author
hyderabad, First Published Jun 27, 2022, 1:07 PM IST

లివర్.. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఈ కాలేయానికి ఏదైనా సమస్య వస్తే.. కోలుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు.. దానిని నయం చేయలేని పరిస్థితి ఏర్పడటానే లివర్ సిర్రోసిస్ అటారు. ఇది ఎక్కువైతే.. ఏకంగా లివర్ ఫెయిల్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది ప్రాణానికి చాలా ప్రమాదం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే.. దీనిని ముందుగా గుర్తించినట్లయితే.. కొన్ని ఆరోగ్య మార్పులతో.. దీనిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందట. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల మనం లివర్ ఫెయిల్యూర్ ని కంట్రోల్ చేయవచ్చట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

సోడియం: సిర్రోసిస్ రోగులకు సోడియం హానికరం. అందువల్ల.. సోడియం చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను దూరం పెట్టాలి. ఒకవేళ తప్పక తినాల్సి వస్తే.. చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.  పరిమితికి మించి తీసుకోవడం వల్ల మీకే ప్రమాదం జరుగుతుందని గుర్తుంచుకోవాలి. 

ప్యాక్ చేసిన ఆహారం: వీటిలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్‌లు , లవణాలు ఉంటాయి, ఇవి లివర సిర్రోసిస్‌తో బాధపడుతున్న రోగులకు పూర్తిగా హానికరం. ఇవి మరింత నష్టాన్ని పెంచుతాయి, కాలేయం పనితీరును ఆపివేయవచ్చు.

ఆల్కహాల్: లివర్ సిర్రోసిస్ ఉన్న రోగులు కచ్చితంగా దూరంగా ఉండాల్సిన మరో ముఖ్యమైనది  ఆల్కహాబల్. ఆల్కహాల్ అధికంగా తాగడం కూడా లివర్ సిర్రోసిస్‌కు కారణం కావచ్చు; కాబట్టి, మీరు దానిని పూర్తిగా నివారించడం ముఖ్యం.

బేకింగ్ ఆహారాలు: బ్రెడ్ ,బిస్కెట్లు వంటి కాల్చిన వస్తువులు సోడియంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా లివర్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి.. దూరంగా ఉండాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios