Asianet News TeluguAsianet News Telugu

బ్రెడ్ ను ఫ్రిజ్ లో పెడుతున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే..!

కొన్ని ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటిని ఫ్రిజ్ లో పెడితే వాటిలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి. అంతేకాదు చాలా తొందరగా పాడైపోతాయి కూడా. 
 

foods which should not keep inside refrigerator rsl
Author
First Published Mar 28, 2023, 4:36 PM IST

ప్రస్తుతం ప్రతి కుటుంబం ఫ్రిజ్ ను వాడుతోంది. తొందరగా పాడైపోయే వస్తువులను పెట్టడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీనివల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసాన్ని కొన్ని రోజులు పాటు నిల్వ చేయడానికి ఫ్రిజ్ సౌకర్యవంతంగా ఉంటుంది. వండిన ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టి తొందరగా పాడవకుండా చూసే వాళ్లు కూడా ఉన్నారు. 

ఫ్రిజ్ వాడకం వల్ల లాభాలు చాలానే ఉన్నా.. ప్రతి వస్తువునూ అందులో పెట్టడం మంచిది కాదు. చాలా మంది ఫ్రిజ్ లో నిల్వ ఉంచే కూరగాయలు, పండ్లు మాత్రమే కాదు, బేకరీ వంటకాలు, వంటకు  ఉపయోగించే అనేక ఇతర పదార్థాలను కూడా దీనిలో పెడుతున్నారు.

నిజానికి మీరు కొన్ని ప్రతి వస్తువునూ ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని పదార్థాలు ఫ్రిజ్ లో పెడితే చాలా తొందరగా పాడై పోతాయి. అలాగే వాటిలో ఉండే పోషకాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఇంతకీ ఎలాంటి ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉల్లిపాయలు

చాలా మంది ఉల్లిపాయలను ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు. అయితే ఫ్రిజ్ ఉల్లిపాయలను త్వరగా డ్యామేజ్ చేయడానికి మాత్రమే సహాయపడుతుంది. అయితే పొట్టు తీసిన ఉల్లిపాయను ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

టమోటాలు

టమోటాలను ఫ్రిజ్ లో  ఖచ్చితంగా పెట్టాలని చాలా మంది అంటుంటారు. కానీ అవసరం లేదు. ఎందుకంటే మోటాలను ఫ్రిజ్ లో నిల్వ చేసినప్పుడు.. అవి బయట ఉన్నప్పుడు కంటే చాలా తొందరగా పాడైపోతాయి. అయితే టమోటాలను ఎయిర్ టైట్ బ్యాగులు లేదా బాక్సుల్లో వేసి ఫ్రిజ్ లో పెడితే టమోటాల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్

బాదం, జీడిపప్పు, కిస్మిస్ వంటి నట్స్, డ్రై ఫ్రూట్స్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయాల్సిన అవసరం లేదు. వీటన్నింటినీ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద గాలి-గట్టి కంటైనర్లలో నిల్వ చేయాలి. దీంతో వాటికి చీమలు, ఇతర కీటకాలు పట్టే అవకాశం ఉండదు. 

బంగాళాదుంపలు

చాలా మంది బంగాళాదుంపలను బయట పెడితే .. కొంతమంది మాత్రం ఫ్రిజ్ లో పెడతారు. అయితే బంగాళాదుంపలను ఫ్రిజ్ లో పెట్టాలనుకుంటే వాటి పొట్టు తీసేసి కొద్దిగా నీటిలో ముంచి గిన్నెను ఫ్రిజ్ లో పెట్టాలి. దీంతో బంగాళాదుంపలు చెడిపోకుండా ఉంటాయి. లేదంటే బంగాళాదుంపలను ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు.

బ్రెడ్

బ్రెడ్ ను ఖచ్చితంగా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఇది చెడిపోకుండా ఉండేందుకు దీన్ని ఫ్రిజ్ లో ఉంచే వారు ఉన్నారు. అయితే బ్రెడ్ ను ఫ్రిజ్ లో పెట్టగానే త్వరగా  చెడిపోతాయి. తినడం కూడా కష్టంగానే ఉంటుంది. అంతేకాదు బ్రెడ్ టేస్ట్ కూడా పోతుంది. బ్రెడ్ ను ఫ్రిజ్ లో కాదు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచండి. అలాగే ఎక్స్ పైరీ డేట్ అయిపోగానే పారేయండి.  

Follow Us:
Download App:
  • android
  • ios